గొడ‌వ‌లంటే భ‌య‌ప‌డే ఓ యువ‌కుడు .. అంద‌మైన అమ్మాయిని చూసి ప్రేమ‌లో ప‌డ్డాడు.. త‌న కోసం రౌడీగా మారాల్సి వ‌స్తుంది. మారుతాడు.. త‌న‌కు భ‌యం లేన‌ట్లు బిల్డ‌ప్‌లిస్తుంటాడు.. మ‌రి ఈ ప్రేమ ప్ర‌యాణంలో అత‌డి పాట్లెలా ఉండ‌బోతున్నాయో తెలుసుకోవాలంటే ‘గ‌ల్లీ రౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్‌. ఇందులో హీరో క్యారెక్ట‌ర్‌ను తెలియ‌జేస్తూ వినేవాళ్ల‌కి న‌వ్వు పుట్టేలా ‘విశాఖ‌ప‌ట్నంలో రౌడీగాడు…’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను నితిన్ విడుదల చేశారు.

“పిల్ల పిల్ల పిల్లకోసం పిల్లగాడు వేసే కొత్త వేషంఇంత‌లోనే ఎంత హ‌ట్ట‌హాసం క‌దిలెను క‌దా! వీడి ప్రేమ క‌థ‌చెయ్య‌లేదు వీడు ఒక్క యుద్దం.. చూడ‌లేడు వీడు కోడి ర‌క్తంరాడ్డు ప‌ట్టినాడు ప్రేమ కోసం ముదిరెను క‌దా వీడి ప్రేమ క‌థ‌……” అంటూ సాగే ఈ పాట‌ను హీరో సందీప్ కిష‌న్‌, హీరోయిన్ నేహా శెట్టి ప్రేమ కోసం పాట్లను చూపించేలా తెరకెక్కించారు.

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ స‌ర్టిఫికేట్ పొందింది. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *