Sunday, January 19, 2025
HomeTrending Newsఅపస్మారక స్థితిలో సాయి ధరమ్ తేజ

అపస్మారక స్థితిలో సాయి ధరమ్ తేజ

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో హైటెక్ సిటీ సమీపంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైకుపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అతి వేగమే దీనికి కారణమని ప్రాథమికంగా అందిన సమాచారం బట్టి తెలుస్తోంది. కుడి కన్ను, కుడివైపు ఛాతీకి బలమైన గాయాలు తలిగినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే అయన అపస్మారక స్థితికి వెళ్ళాడని సమాచారం. మెడికవర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ కు ప్రాణాపాయం లేదని మెడికవర్ ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు మాదాపూర్ పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన వెంటనే షాక్ కు గురై అపస్మార స్థితికి వెళ్ళినట్లు వైద్యులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్