Tuesday, May 14, 2024
HomeTrending Newsభవానీపూర్ నుంచి దీదీ నామినేషన్

భవానీపూర్ నుంచి దీదీ నామినేషన్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొంత మంది పార్టీ శ్రేణులతో కలిసి వెళ్ళిన మమత నామినేషన్ పత్రాల్ని ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ నెల 30 వ తేదీన భవానీపూర్ లో పోలింగ్ ఉంటుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3 వ తేదీన వెలువడతాయి.

ఇటీవలి బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సువెందు అధికారితో పోటీపడి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా దీది పరాజయం పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది. సిఎం పదవిలో కొనసాగుతున్న మమత బెనర్జీ ఆరు నెలల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నిక కావల్సి ఉంది. నవంబర్ నాలుగో తేదీలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోతే సిఎం పదవి నుంచి దీది దిగిపోవాల్సి ఉంటుంది. అదే జరిగితే మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రణాలికలు సిద్దం చేసినట్టు సమాచారం. అయితే తెగే వరకు లాగొద్దన్న రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నికల నగారా మోగించింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుందనేది అందరికీ తెలిసిందే.

పశ్చిమబెంగాల్లో భవానీపూర్ తో పాటు షంషేర్ గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలు ఒరిస్సాలో పిప్లి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

భవానీపూర్ లో మమత బెనర్జీ మీద బిజెపి తరపున ప్రియాంక తిబ్రేవాల్ పోటీ చేస్తున్నారు.  ఈ మేరకు బిజెపి రాష్ట్ర శాఖ అభ్యర్థులను ప్రకటించింది. షంషేర్ గంజ్ నుంచి తృణముల్ కాంగ్రెస్ తరపున అమిరుల్ హుస్సేన్  బరిలో నిలువగా అయానతో బిజెపి నుంచి మిలన్ ఘోష్ తలపడుతున్నారు. జాంగీ పూర్ నుంచి బిజెపి తరపున సుజిత్ దాస్ రంగంలో ఉన్నారు. సుజిత్ దాస్ మీద తృణముల్ కాంగ్రెస్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్