Saturday, June 13, 2026
Homeసినిమావేడుకగా శర్వానంద్ నిశ్చితార్థం- హాజరైన చరణ్-ఉపాసన

వేడుకగా శర్వానంద్ నిశ్చితార్థం- హాజరైన చరణ్-ఉపాసన

సినీ హీరో శర్వానంద్ వివాహ నిశ్చితార్థం రక్షితతో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన ఆత్మీయుల సమక్షంలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు రాం చరణ్ – ఉపాసన దంపతులు హాజరయ్యారు.  వివాహ తేదీని త్వరలోనే నిర్ణయించనున్నారు.

రక్షితారెడ్డి సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని కాగా ఆమె తండ్రి మధుసూదన రెడ్డి హైకోర్టు లాయర్‌. వధువు కుటుంబానికి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular