Thursday, April 25, 2024
HomeTrending Newsఅర్హులందరికీ నవరత్నాలు: గవర్నర్

అర్హులందరికీ నవరత్నాలు: గవర్నర్

విద్య వైద్యం, వ్యవసాయ రంగాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.  రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని, విద్యా రంగంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చి పేదవారికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు.  డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని పేదలకు చేరువ చేశామని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకలాలు తిలకించారు. ఈ ప్రదర్శనలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ సందేశమిచ్చారు. వాటిలో ముఖ్యాంశాలు:

  • గడప గడపకూ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళుతున్నారు.
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.
  • ఏపీ జీఎస్డిపీ 11.43 శాతంగా నమోదైంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా 9ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాం
  • మన బడి – నాడు నేడు పథకం ద్వారా 45,854 పాఠశాలలు, 471 జూనియర్ కాలేజీలు, 151 డిగ్రీ కాలేజీలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్ళలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
  • ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి విద్యార్థులకు సీబీఎస్ఈ విద్య అందిస్తున్నాం

  • జగనన్న విద్యా కనుక ద్వారా పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నాం
  • నాడు-నేడు పథకం కింద మూడు దశల్లో 17,805 కోట్ల రూపాయలు ఖర్చు
  • అమ్మ ఒడి ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు రూ. 19,617 కోట్లు అందించాం. దీని ద్వారా 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి
  • డిజిటల్ లెర్నింగ్ కోసం విద్యార్ధులకు 5.18లక్షల ట్యాబ్ లు అందించాం
  • ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు
  • రాష్ట్రంలో కొత్తగా 17వైద్య కళాశాలలు
  • ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నాం
  • గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నాం
  • రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం
  • కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు,  నవరత్నాలు అర్హులందరికీ అందుతున్నాయి

ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్