Sunday, January 19, 2025

ధూళిపాళకు ఊరట

తెలుగుదేశం నేత ధూళిపాళ నరేంద్రను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి పరిక్షలు చేయించాలని హై కోర్టు ఆదేశించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న నరేంద్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కోవిడ్ లక్షణాలు వున్నాయని వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ధూళిపాళ తరఫు న్యాయవాదులు హై కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

సంగం డెయిరీ ఎండి గోపాల కృష్ణ కోవిడ్ తో బాధ పడుతున్నారని ధూళిపాళ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ జరిపిన హై కోర్ట్ వెంటనే వైద్యం అందించాలని ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర చర్యలుంటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్