Sunday, September 8, 2024
HomeTrending Newsరాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం

శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 14169 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదు,గత సంవత్సరం ఇదే రోజు గరిష్ట డిమాండ్ 11876 మెగా వాట్లు మాత్రమే వినియోగం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు ఇదే. గత డిసెంబర్ నెలలో 13403 మెగా వాట్ల విద్యుత్ డిమెండ్ నమోదు కాగా తాజాగా 14169 మెగా వాట్ల విద్యుత్ వినియోగం. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి ఫిబ్రవరి నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి 14169 మెగా వాట్ల విద్యుత్ నమోదు.

మరోవైపు ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్నంత వరకు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నందించడంలో రాజీ ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తొమ్మిది వేల నాలుగు వందల ఎనబై ఆరు కోట్ల తొంబయి రెండు లక్షల పదమూడు వేల రూపాయలతో ఇంధన శాఖ పద్దును మంత్రి జగదీష్ రెడ్డి శుక్రవారం ప్రవేశ పెట్టారు.ఈ సందర్భంగా సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానమిస్తూ మరో నెల రోజులకు చేరాల్సిన పీక్ డిమాండ్ నెల రోజుల ముందుకు అంటే ఈ పద్దు ప్రవేశ పెట్టె సమయానికి 14,169 మేఘావాట్లకు చేరిందని ఆయన ప్రకటించారు. పీక్ డిమాండ్ 18,000 మేఘావాట్లకు చేరుకున్నా సరఫరా లో ఎటువంటి అంతరాయం ఉండదని ఆయన తెలిపారు. పీక్ డిమాండ్ 14,169 మేఘావాట్లకు చేరింది అంటేనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో ఎటువంటి అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుందనేది ఇట్టే తెలిపోతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత కు విద్యుత్ రంగంలో విజయాలే దిక్సూచి గా నిలుస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్