ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. నిన్నటి సభలో బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ భరత్ ఇంటిన నుంచి బస్టాండ్ వరకూ వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా నేడు చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటిన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
కుప్పం గంగమ్మ గుడి సెంటర్ లో టిడిపి నేత రవి పై దాడికి పాల్పడినట్లు తెలిసింది. టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సెంటర్ కు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలూ ప్రత్యర్థి పార్టీల ఫ్లెక్సీలను చించి వేసుకోవడం, రాళ్ళ దాడులకు దిగారు. పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అన్నా క్యాంటిన్ ప్రాంతానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు.
Also Read : కుప్పంకాబోయే ఎమ్మెల్యే భరత్ : పెద్దిరెడ్డి