Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Eng Vs. NZ:  న్యూజిలాండ్ వెనుకంజ

Eng Vs. NZ:  న్యూజిలాండ్ వెనుకంజ

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.  టామ్ లాథమ్-35; హెన్రీ నికోలస్-30   రన్స్ చేసి ఔట్ కాగా, టామ్ బ్లండెల్-25; టిమ్ సౌతీ-23 పరుగులతో క్రీజులో ఉన్నారు.  డెవాన్ కాన్వే డకౌట్, కేన్ విలియమ్సన్ (4); విల్ యంగ్ (2); డెరిల్ మిచెల్ (13); మైఖేల్ బ్రేస్ వెల్ (6) విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్ చెరో మూడు; స్టువార్ట్ బ్రాడ్ ఒక వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఇంగ్లాండ్ 435 పరుగులకు 8వికెట్ల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 3 వికెట్లకు 315 పరుగుల వద్ద నేటి రెండోరోజు ఆట ఇంగ్లాండ్ మొదలు పెట్టింది. నిన్న 184తో క్రీజులో ఉన్న హ్యారీ బ్రూక్స్ మరో రెండు పరుగులు జోడించి 186 వద్ద ఔటయ్యాడు.  నిన్న 101 చేసిన నిలిచిన జో రూట్ 153 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ-4; బ్రేస్ వెల్-2; సౌతీ, వాగ్నర్ చెరో వికెట్ పడగొట్టారు.

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 297పరుగులు వెనుకబడి ఉంది.

Also Read : Eng Vs.NZ 2nd Test: రూట్, బ్రూక్ సెంచరీలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్