Sunday, November 24, 2024
Homeసినిమాషూటింగులు బంద్. ఇండ‌స్ట్రీలో అసలేం జ‌రుగుతోంది?

షూటింగులు బంద్. ఇండ‌స్ట్రీలో అసలేం జ‌రుగుతోంది?

సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆగ‌ష్టు 1 నుంచి సినిమా షూటింగులు ఆపేయాల‌ని ప్రొడ్యూస‌ర్ గిల్డ్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్రొడ్యూస‌ర్ గిల్డ్ నిర్ణ‌యాన్ని ఫిలిం ఛాంబ‌ర్ స‌మ‌ర్థించింది. నిర్మాత‌లంద‌రూ ఏకాభ్రియాంతో షూటింగులు ఆపేస్తున్న‌ట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ఇది ఇండ‌స్ట్రీలో కీల‌క ప‌రిణామం అని చెప్ప‌చ్చు. అంద‌రూ కూర్చొని స‌మ‌స్య‌ల‌కు పరిష్కార మార్గం క‌నుక్కున్న త‌ర్వాత షూటింగులు స్టార్ట్ చేస్తామ‌ని దిల్ రాజు చెప్పారు.

నిర్మాత‌లు తీసుకున్న ఈ నిర్ణ‌యంతో షూటింగులో ఉన్న సినిమాలు, స్టార్ట్ చేయాలనుకున్న సినిమాలు ఎక్క‌డిక్క‌డ ఆగిపోయాయి. చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’, బాల‌య్య 107వ చిత్రం; నాగార్జున ‘ది ఘోస్ట్’; ప్ర‌భాస్ ‘ప్రాజెక్ట్ కే’, ‘స‌లార్’; విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఖుషీ’; రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ మూవీ;  నాని ‘ద‌స‌రా’; ర‌వితేజ ‘రావ‌ణాసుర‌’;  విజ‌య్ ‘వార‌సుడు’; అఖిల్ ‘ఏజెంట్’ ఇలా దాదాపు ముప్పై సినిమాలు ఆగిపోయాయి.

పెరిగిన బ‌డ్జెట్, ఓటీటీ, సినీ కార్మికుల వేత‌నాలు పెంపు విష‌యాల మీద నిర్మాత‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. బ‌డ్జెట్ ని ఎలా కంట్రోల్ చేయాలి?  థియేట‌ర్ల‌కి ప్రేక్ష‌కుల‌ను ఎలా ర‌ప్పించాలి?  ఎలాంటి కంటెంట్ తో సినిమాలు చేయాలి? అనే వాటి గురించి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. రెండు వారాల్లో ఈ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం వస్తుందని నిర్మాత‌లు చెబుతున్నారు.  ఇన్ని కీలకమైన అంశాలకు రెండు వారాల్లో ఎలా పరిష్కారం దొరుకుతుందన్నడి వేచి చూడాలి.

Also Read : ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు బంద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్