Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ప్రన్నోయ్ గెలుపు, సేన్-శ్రీకాంత్ ఓటమి

ప్రన్నోయ్ గెలుపు, సేన్-శ్రీకాంత్ ఓటమి

Indonesia Open: ఇండోనేసియా ఓపెన్ -2022  టోర్నమెంట్ లో హెచ్ ఎస్ ప్రన్నోయ్ రెండో రౌండ్ లోకి ప్రవేశించాడు. నేడు జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్ లో ప్రన్నోయ్ మన దేశానికే చెందిన లక్ష్య సేన్ పై 21-10; 21-9 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో కిడంబి శ్రీకాంత్ 23-21; 21-10 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడు బ్రిస్ లెవెర్డెజ్ చేతితో ఓటమి పాలయ్యాడు.

పురుషుల డబుల్స్ లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో  మన దేశానికి చెందిన ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల ద్వయం 27-25;18-21;21-19 తో జపాన్ ఆటగాళ్ళ జోడీపై విజయం సాధించారు

మహిళల డబుల్స్ లో ఆశ్మిత భట్- శిఖా గౌతమ్ జోడీ; హరిత హరినారాయణ్-అష్మా రాయ్ జోడీలు తమ ప్రత్యర్థులపై ఓటమి పాలయ్యారు.

నిన్న జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ ల్లో పురుషుల సింగిల్స్ లో సమీర్ వర్మ, మహిళల డబుల్స్ లో అశ్వని పోన్నప్ప-సిక్కీ రెడ్డి జోడీ విజయం సాధించి రెండో రౌండ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే.

రేపు రెండో రౌండ్ మ్యాచ్ లు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్