Saturday, November 23, 2024
HomeTrending Newsసంబరంగా సామాజిక యాత్ర ప్రారంభం

సంబరంగా సామాజిక యాత్ర ప్రారంభం

Samajiya Yatra: రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న బస్సు యాత్ర నేడు శ్రీకాకుళంలో ఘనంగా ప్రారంభమైంది.

నేటి ఉదయం మంత్రులు, నేతలు డా. బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబూ జగజ్జీవన్ రామ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్,  డా. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్సు యాత్ర బలదేరింది. ఈ సాయంత్రం విజయనగరంలో భారీ బహిరంగ సభ జరగనుంది.

శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ఈ యాత్ర ముగుస్తుంది. నేడు 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించానున్నారు. ఈ బస్సు యాత్రలో క్యాబినెట్‌లో ఉన్న 17మంది మంత్రులే కాకుండా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఆయా ప్రాంతాల చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్నవారంతా పాల్గొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్