హుజురాబాద్ ఉపఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీల నుంచి హేమీ హేమీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రంతో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికార పార్టీ తరపున విద్యార్ధి నాయకుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తుండగా మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ హుజురాబాద్ లోనే మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హుజురాబాద్ బహిరంగసభ నిర్వహించలేదు. అటు బిజెపి నుంచి తాజా మాజీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ తదితరులు ప్రచారం చేయగా మాజీ ఎంపి వివేక్ విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మురి వెంకట్ బరిలో దిగగా దామోదర రాజనర్సింహ హుజురాబాద్ లోనే ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, ఉత్తమకుమార్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ టైమింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రతిసారి 48 గంటల ముందు పూర్తి అయ్యేదని, ఈ దఫా కోవిడ్ నిబంధనల మేరకు 72 గంటల సైలెంట్ పీరియడ్ ఉంటుందన్నారు. నియోజకవర్గం మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అభ్యర్థులు డోర్ to డోర్ ప్రచారం చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఈవిమ్ సరఫరా పోలింగ్ స్టేషన్ వరకు కోవిడ్ నిబంధనలు పాటించాలి. ప్రతి పోలింగ్ సెంటర్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాము ఆశ, ఏ ఎన్ ఎం లు అందుబాటులో ఉంటారు. శానిటేషన్ అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, 200 మీటర్ దూరం వరకు పొలిటికల్ పార్టీలు, మిగతా వారు 100 మీటర్ ల దూరం ఉండాలని నిబంధన విధించినట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 95% ఓటర్ స్లిప్ పంపిణి, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన 11 గుర్తింపు కార్డులు మాత్రమే అనుమతి ఉంటుంది.
పోలీస్ కమిషనర్ సత్యనారాయణ.. కామెంట్స్ :
ఈరోజు 7 గంటలకు ప్రచారం సమాప్తం అయింది. సి విజిల్ ను ఉపయోగించుకొని పిర్యాదులు చేయాలి. ప్రజలు శాంతి యుతంగా ఓటును వినియోగించుకోవాలి. ఎన్నికల విధుల కోసం 4 వేల మంది ని ఫోర్స్ ఉపయోగించుకుంటున్నాం. ఇందుకు 25 కేంద్ర బలగలను తెప్పించాము. అసాంఘిక శక్తుల చర్యలు అడ్డుకుంటాం. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి స్థానికేతరులు అంతా వెళ్లిపోవాలి. శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అందరూ సహకరించాలి. ఉప ఎన్నిక జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది.