Tuesday, September 17, 2024
HomeTrending NewsPawan Kalyan: ఆంధ్రా గోల్డ్ కు ఎక్కువ - బూమ్ బూమ్ కు తక్కువ

Pawan Kalyan: ఆంధ్రా గోల్డ్ కు ఎక్కువ – బూమ్ బూమ్ కు తక్కువ

వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు వేతనం ఇచ్చి వారి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని, ఈ విషయంపై జగన్ ప్రభుత్వాన్ని  ఏపీ హైకోర్ట్  కూడా ప్రశ్నించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అందువల్ల వారికి ప్రజల నుంచి ఎలాంటి సమాచారం సేకరించే అర్హత లేదని కూడా కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ ఎందుకనే విషయాన్ని నిలదీసిందని వివరించారు.  రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తనకు  సోదర సమానులని, వారి పొట్ట కొట్టాలన్నది తన ఉద్దేశం ఏనాడూ కాదని, వారికి  ఐదు వేలు ఇస్తుంటే మరో ఐదు వేల రూపాయలు కలిపి ఇచ్చే స్వభావం ఉన్నవాడినని వివరణ ఇచ్చారు. అందరూ చెడ్డవాళ్ళని చెప్పే ఉద్దేశం కాదని, ఓ మామిడి బుట్టలో ఒక్క పండు కుళ్ళినా మిగిలిన అన్ని పళ్ళూ పాడైపోతాయని పేర్కొన్నారు. జనసేన వారాహి యాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.

వాలంటీర్ల పరిస్థితి, వారి జీతం ఆంధ్రా గోల్డ్ కు ఎక్కువ, బూమ్ బూమ్ బీర్ కు తక్కువ అన్నట్లుందని అన్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ లోని ఎఫ్ఏవొ అనే ఓ ఫీల్డ్ ఆపరేషన్ సంస్థకు ఏపీ ప్రజల ఆధార కార్డ్ వివరాలు ఎందుకు అందించారని, ఆ సంస్థలో పనిచేస్తున్న 750 మంది ఉద్యోగులకు జీతాలు ఎవరు చెల్లిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మిలిటరీ మాధవరం గ్రామం నుంచి వేలాది మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్నారని. కానీ ఆ గ్రామంలో కనీస వసతులు ఈ ప్రభుత్వం కల్పించలేకపోయిందని పవన్ విమర్శించారు. జనసేన ఆ గ్రామానికి అండగా ఉంటుందన్నారు.

విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో తాను చూపిస్తానని హెచ్చరించారు. కృష్ణుడు ఎటు ఉంటే అటు ధర్మం ఉన్నట్లు అని, వచ్చే ఎన్నికల్లో ధర్మమే గెలుస్తుందని, వైఎస్సార్సీపీని ఓడిస్తామని శపథం చేశారు. అభివృద్ధి జరగాలంటే.. ఈ ప్రభుత్వం మారాలి;  అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి; జనం బాగుండాలంటే జగన్ పోవాలి అంటూ నినాదం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్