Sunday, September 8, 2024
HomeTrending Newsపనికిమాలిన వాగుడు వద్దు: నాని హెచ్చరిక

పనికిమాలిన వాగుడు వద్దు: నాని హెచ్చరిక

తనకు రాజకీయ భిక్షపెట్టింది హరికృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని, తాను ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తనకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చని అయినా సరే వారిపై తాను విమర్శలు చేయబోనని, అతను తిట్టినా, చంపినా తాను ఏమీ మాట్లాడబోనని ఉద్వేగంగా వెల్లడించారు. చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష  పెడితే తాను ఆయనకు ద్రోహం చేశానంటూ టిడిపి నేతలు తనపై చేస్తున్న విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. తనను విశ్వాసం లేని కుక్క అని, గుట్కా తింటానంటూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై కొడాలి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నేను గుట్కా వేసి వూస్తుంటే మీరు ఎప్పుడైనా డబ్బా పట్టుకున్నారా’ అని నిలదీశారు. పనికిరాని మాటలు, వాగుడు కట్టిపెట్టాలని హెచ్చరించారు.

అమరావతి పాదయాత్ర  ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని, ‘చస్తే ఏమిటి, బతికితే ఏమిటి’ అంటూ అతన్ని విమర్శించడంపై నాని మండిపడ్డారు. నాడు సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. నీ సమకాలికుడి కొడుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టి నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు, ఇంతకంటే నిన్ను చేయాల్సింది ఏముంటుంది? అని బాబునుద్దేశించి ప్రశ్నించారు.

తాను తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ అభిమానిని కాదని, ఎన్టీఆర్ కుటుంబానికి, హరికృష్ణ గారికి, అభిమానినని, ఆయన ‘అన్నా ఎన్టీఆర్’ పార్టీ పెట్టినప్పుడు ఆయనతోనే కలిసి నడిచానని, 2002 సంవత్సరంలో నిమ్మకూరులో ఇండిపెండెంట్ ఎంపిటిసిని పోటీలో నిలిపి గెలిపించానని, కాంగ్రెస్ సాయంతో ఎంపిపి చేశానని గుర్తుచేశారు. వైఎస్ ప్రభంజనాన్ని తట్టుకొని కూడా తాను రెండుసార్లు గుడివాడలో ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.

అమరావతి పాదయాత్ర రెండు పార్టీలు, మూడు మీడియాల్లో తప్పితే ఎక్కడా కనబడడం లేదని నాని వ్యాఖ్యానించారు. పాదయాత్ర అంటూ బయల్దేరిన వాళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యతా ఉత్తరాంధ్ర ప్రజలమీదే ఉందని చెప్పారు. అమరావతిని భూతద్దంలో పెట్టి ఎక్కడో చూపిస్తూ, ఉత్తరాంధ్ర ఉద్యమం కృత్రిమం అంటూ చూపిస్తున్న మీడియాను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.

Also Read 2024 లోపే వైజాగ్ వెళ్తాం: నాని వెల్లడి

RELATED ARTICLES

Most Popular

న్యూస్