Sunday, January 19, 2025
Homeసినిమాఅందుకే నేను సుకుమార్ ను ఏమీ అనలేను: అల్లు అర్జున్ 

అందుకే నేను సుకుమార్ ను ఏమీ అనలేను: అల్లు అర్జున్ 

నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘18 పేజెస్‘ సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 – సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. బన్నీ ముఖ్య అతిథిగా ఈ ఫంక్షన్ జరిగింది.

ఈ ఫంక్షన్ లో బన్నీ మాట్లాడుతూ .. “ఈ ఈవెంట్ కి నేను రావడానికి కారణం ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా నా ఫేవరేట్ పీపుల్ కావడమే. ఈ సినిమాకి సుకుమార్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. ఆయన లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదేమోనని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకు నేను ఎప్పుడూ ఆయనను ప్రేమిస్తూనే ఉంటాను. ఆయనను అంతగా లవ్ చేస్తుంటాను గనుకనే, సినిమా ఎంత లేట్ అయినా నేను అడగలేను.

బన్నీ వాసు విషయానికి వస్తే .. ఆయన నా ఫ్రెండ్ అనాలా? నా బ్రదర్ అనాలా? నా గైడ్ అనాలా? తన పేరులో బన్నీ ఉంది .. నా పేరులో వాసు పెట్టుకోవచ్చు. మా ఇద్దరి మధ్య అంతటి అనుబంధం ఉంది. ఇక అనుపమ చాలా బాగా చేస్తుందని నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టినందుకు సంతోషంగా ఉంది. నాలుగేళ్లపాటు ఈ కథపైనే కూర్చున్న పల్నాటి సూర్యప్రతాప్ కష్టం ఫలించాలని కోరుకుంటున్నాను. ఈ  సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అంటూ ముగించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్