Sunday, January 19, 2025
Homeసినిమావాటిని అస్సలు పట్టించుకోను - థమన్

వాటిని అస్సలు పట్టించుకోను – థమన్

టాలీవుడ్ లో ఉన్న బిజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. రీ రికార్డింగ్ అదరగొట్టేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. దీనితో పాటు చెప్పిన టైమ్ కి వర్క్ కంప్లీట్ చేయడన్న విమర్శ కూడా ఉంది. ‘గుంటూరు కారం’ నుంచి తప్పించారంటూ థమన్ పై ఈ మధ్య జోరుగా వార్తలొచ్చాయి.  వీటిపై తనదైన స్టైల్ లో సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చాడు. థమన్ మ్యూజిక్ అందించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’ ఈ నెల 28న విడుదల కానుంది.  బ్రో ప్రమోషన్స్ లో భాగంగా థమన్ మీడియా ముందుకు వచ్చాడు.

ఈ మీడియా మీట్ లో థమన్ ని గుంటూరు కారం సినిమా మ్యూజిక్ గురించి అడిగితే.. ‘అందరూ ఆ సినిమా మీద ఎందుకు పడ్డారో అర్థం కావడం లేదు. ఆ సినిమా నుంచి తప్పించారంటూ వార్తలు రాశారు. ఏదైనా ఉంటే ప్రొడ్యూసర్ చెబుతారు కదా’ అని ప్రశ్నించారు. ‘సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు అన్నీ చూస్తుంటాను కానీ.. అందులో మంచి ఉంటే తీసుకుంటాను.. చెడు ఉంటే పక్కన పెట్టేస్తాను. అస్సలు పట్టించుకోను’ అన్నాడు.  ‘సంగీతం మీద ఎంత శ్రద్ధ పెడతానో, సంగీతం కోసం ఎంతో కష్టపడతానో మా దర్శక నిర్మాతలకు తెలుసు. కొందరేదో కావాలని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తే, మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు.

బ్రో సినిమా గురించి చెబుతూ… త్వరలో తేజ్ డ్యూయట్ సాంగ్ ఒకటి రానుంది. అలాగే శ్లోకాలను అన్నింటినీ కలిపి ఒక పాటలా విడుదల చేయబోతున్నాం. అంతే కాకుండా క్లైమాక్స్ లో ఒక మాంటేజ్ సాంగ్ కి సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం నాలుగు పాటలు ఉంటాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్