Saturday, July 27, 2024
HomeTrending NewsTANA: ప్రవాసీలు దేశ అభివృద్ధికి చోదక శక్తులు - మంత్రి ఎర్రబెల్లి

TANA: ప్రవాసీలు దేశ అభివృద్ధికి చోదక శక్తులు – మంత్రి ఎర్రబెల్లి

అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తానా సభలు ముగిసిన తర్వాత అక్కడి ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. వివిధ ఉద్యోగాల కోసం సుదూర తీరాలకు చేరిన ప్రముఖ NRI ల కోరిక మేరకు వారి ఇండ్లకు వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరిస్తున్నారు. తానా సభల కోసం అమెరికా చేరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెన్సిల్వేనియా రాష్ట్రం, ఫిలడెల్ఫియా లోని సాయి దత్త ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు మంత్రిని ఘనంగా స్వాగతించారు. వేద ఆశీర్వచనం అందించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో NRI ల పాత్ర, తెలుగు ప్రజలను కలుపుతున్న TANA సభలు వంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తానా మహా సభలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. తెలుగు ప్రభుత్వాల ప్రతినిధులు, మంత్రులు, తెలుగు వారైన ప్రముఖులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు, అనేక మంది హాజరయ్యారు. తమకు ఆతిథ్యం ఇవ్వడానికి అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. మనం ఎక్కడ ఉన్నా మన దేశ భక్తిని, కన్న తల్లి ని, పుట్టిన ఊరిని మరచిపోలేదని అన్నారు. మనం ఎక్కడ ఉన్నా, మన పనితనం తో ఇక్కడి, మన దేశ, రాష్ట్ర, గ్రామ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాం. ఉంటాం. దేశ సంపద పెంపులో, నిర్మాణంలో మనమే ముందున్నం. భవిష్యత్తులో ఇది మరింతగా కొనసాగాలి. దేశాల మధ్య వారధులుగా, అభివృద్ధి సారథులు గా nri లు నిలవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కెసిఆర్ అధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, విడిపోయాక రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్