I Wish To Do Characters Like Keerthi Samantha In Mahanati O Baby Movies :
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా“మంచి రోజులు వచ్చాయి”. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్ మీడియాతో మాట్లాడారు. మంచిరోజులు వచ్చాయి గురించి మెహ్రీన్ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..
“యువి క్రియేషన్స్, యస్.కె.యన్, మారుతీ గార్ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది చాలా మంచి సబ్జెక్టు. మారుతి గారు కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. నా లైఫ్ లో కనెక్ట్ అయిన ఫస్ట్ మూవీ ఇది. ఇంత మంచి టీం తో చాలా ఎంజాయ్ చేస్తూ.. వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పద్దు క్యారెక్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర చేస్తున్నాను. ఈ సినిమా మారుతి గారు స్టైల్ లో ఫుల్ ఎంటర్టైనర్ జోనర్లో ఉంటుంది. ఇది ఒక కాలనీలో జరిగే కథ ఇది. ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి. అలాంటి స్టోరీని కథగా తీసుకొని ఎంటర్టైన్మెంట్ రూపంగా ప్రేక్షకులకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో మేము చేసిన సీన్స్, పరిస్థితులు కోవిడ్ టైం లో చాలా మందికి జరిగాయి”
“నేను F2, F3 సినిమాల్లో చేసిన పాత్రలకంటే ఇందులో చేస్తున్న పాత్ర డిఫరెంట్. నేను నార్మల్ గా చాలా ఫన్నీగా ఉంటాను. అందువల్ల నేను చేసే క్యారెక్టర్స్ లో అల్లరి అయినా, కామెడీ అయినా చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇందులో కూడా నా క్యారెక్టర్ మంచి ఎమోషన్స్ తో ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్యాకేజ్డ్ గా ఉంటుంది. సంతోష్ నటన పరంగా చాలా బాగా పెర్ఫార్మన్స్ చేశాడు. అజయ్ ఘోష్ గారు ఫాదర్ గా నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ లో అజయ్ గారు ఇలా అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. క్యారెక్టర్ పరంగా నాకే డౌట్ ఉన్నా మారుతి గారి దగ్గరికెళ్లి సలహాలు తీసుకున్నాను. అందువల్ల నేను చాలా ఈజీగా చేయగలిగేదాన్ని, కథ మీద నమ్మకంతో యు.వి.క్రియేషన్స్ మారుతి గారి మీద నమ్మకంతో ఈ కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ లాంటి సినిమా తర్వాత ఇందులో నాకు ఇది మంచి రోల్ ఇచ్చారు. నేను చేసే ప్రతి సినిమా చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలుగానే భావిస్తాను. కోవిడ్ టైంలో కూడా ప్రికాషన్స్ పాటిస్తూ మేము సినిమా షూట్ చేయడం జరిగింది. అలాగే కోవిడ్ కారణంగా చాలా మంది హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా వున్నాను. నాకు, మా మదర్ కి కోవిడ్ వచ్చింది. వన్ మంత్ తర్వాత మేము రికవరీ అయ్యాము. ఈ సినిమా కోసం మేమంతా కష్టపడి చేశాము సినిమా బాగా వచ్చింది. నా గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను పాజిటివ్ అయినా నెగటివ్ అయినా ఈక్వల్ గా తీసుకుంటాను”
‘మహానటి’ లో కీర్తి సురేష్, ‘ఓ బేబీ’ లో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నాకు చేయాలని ఉంది. కన్నడలో శివరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా అయిన తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని స్టోరీస్ వింటున్నాను. వాటిని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను” అన్నారు.
Must Read :చిరు మూవీలో కీర్తి సురేష్.