Saturday, January 18, 2025
Homeసినిమావిలన్ గా ఛాన్స్ వస్తే నా సత్తా ఏమిటో చూపిస్తాను: మంచు విష్ణు

విలన్ గా ఛాన్స్ వస్తే నా సత్తా ఏమిటో చూపిస్తాను: మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా సూర్య ‘జిన్నా’ సినిమాను రూపొందించాడు. విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో, కథానాయికలుగా పాయల్ – సన్నీలియోన్ అందాల సందడి చేయనున్నారు. జి. నాగేశ్వర రెడ్డి – కోన వెంకట్ ఈ కథ వెనుక ఉండటంతో, ఈ సినిమాలో కామెడీ ఒక రేంజ్ లో ఉండొచ్చునని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో విష్ణు అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

“నేను సెట్లో ఎంజాయ్ చేస్తూ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ‘జిన్నా’ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. అందువలన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక నా ఫిజిక్ విలన్ పాత్రలకు కూడా సరిపోతుందనీ .. విలన్ గా కూడా చేయవచ్చును గదా అని చాలామంది అడుగుతున్నారు. నిజానికి నాకు కూడా విలన్ రోల్స్ చేయాలనే ఉంది. విలన్ గా ఏ హీరోతో తలపడటానికైనా నేను రెడీగానే ఉన్నాను. పవర్ ఫుల్ విలన్ పాత్ర దొరికితే ఒక రేంజ్ లో ఆడుకుంటాను. అలాంటి రోల్స్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఈ విషయంలో కూడా నాకు మా నాన్నగారే స్ఫూర్తి.

క సోషల్ మీడియాలో మాపై ట్రోలింగ్స్ ఎక్కువగా ఉన్న మాట నిజం. ‘మా’ ఎలక్షన్స్ దగ్గర నుంచే ఇలా జరుగుతోంది. ఒక మేధావి మనుషులను పెట్టుకుని మరీ మాపై ఇలాంటి ట్రోల్స్ చేయిస్తున్నాడు. అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆ హీరో ఎవరనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇండస్ట్రీలో ఉన్నవారికీ .. మీడియా వారికి అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడమే నా ముందున్న పని. ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నా గమ్యాన్ని నేను చేరుకోలేను” అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read :  జిన్నాలో ‘జారు మిఠాయి’పాట విడుదల 

RELATED ARTICLES

Most Popular

న్యూస్