If The Long Problem Is Not Solved Now It Will Never Come Said Minister Puvada :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా నెలకొన్న పొడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి, పరిష్కరం దిశగా అడుగులు వేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ నందు పొడు, అడవుల పరిరక్షణ పై జిల్లా కలెక్టర్ అనుదీప్, ITDA పిఓ గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్ దత్, అటవీ శాఖ అధికారులు CCF రాజారావు, వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు. పొడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి పువ్వాడ వెల్లడించారు.
ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యంలో పలు మార్లు ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ కి నివేదిక అందించిందని ఆయన చెప్పారు. అందులో బాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పొడు భూముల సమస్యకు తెరదించే ప్రయత్నంలో భాగంగ ఏర్పాటైన ఉపసంఘానికి కోనసాగింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించామన్నారు. పొడు సమస్యలపై గత పార్టీలకు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇప్పటికి ఈ సమస్య ఇలానే ఉందన్నారు. పేదలకు న్యాయం జరిగేలా చూడలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యం అని, చిత్తశుద్ధి లేకుంటే పొడు సమస్య కేంద్రం పరిధిలో ఉంది అన్న కుంటిసాకుతో తప్పించుకునే వాళ్ళమని వివరించారు.
రాష్ట్రంలో సుమారు 8 లక్షల పై చెలుకు ఎకరాల్లో దాదాపు 2.35 లక్షల ఎకరాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉందని అని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కరం లభించాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. అనేక సంవత్సరాల పాటు అడవులు నరికివేతకు గురి అయ్యాయన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాకే అడవి విస్తీరణం పెరిగిందని, వాటిని సంరక్షించమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హరితహారం కార్యక్రమం మొదటి విడతకు నేటి పరిస్థితులను సరి చేసుకోవాలన్నారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పొడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఆయన చెప్పారు. ఆ దిశగా అటవీ, రెవిన్యూ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యహరించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, వనమా వెంకటేశ్వర రావు ,మెచ్చా నాగేశ్వర రావు, రాములు నాయక్ , కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు షాభిర్ పాషా(సిపిఐ), దుర్గా ప్రసాద్(కాంగ్రెస్), మిడియం బాబూరావు(సిపిఎం), కోనేరు నాగేశ్వరరావు(బీజేపీ), గంధం మల్లికార్జున్(బీఎస్పీ), పునేం శ్రీను(తెరాస), వి.నారాయణ(టిడిపి), తదితర పార్టీల నాయకులు, అధికారులు ఉన్నారు.
Must Read : నవంబర్ 8 నుండి పోడుభూముల క్లెయిమ్స్