అగ్రరాజ్యంలో తుపాకి సంస్కృతి ఆగడం లేదు. ఇప్పటికే దేశమంతా కాల్పుల ఘటనలతో దద్దరిల్లిపోతుంది. ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎవరు కాల్పులు జరుపుతారో అనే భయంతో బతుకున్నారు. తాజాగా, యూఎస్ లోని ఇల్లినాయిస్ లోని హైలాండ్ పార్క్ ఫోర్త్ ఆఫ్ జులై పెరేడ్ వద్ద కాల్పుల ఘటన జరిగింది. చికాగోలోని సబర్బ్ లో కవాతు జరగుతుండగా, ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులలో ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. 24 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు.
దీంతో అక్కడి వారు భయంతో పరుగులు పెట్టారు. మరికొందరు తూటాల బారిన పడ్డారు. దుండగుడు ఒక దుకాణంపై నిలబడి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. షూటర్ ఒక దుకాణం పైకప్పుపై ఉన్నారని, గుంపులపైకి, 20 రౌండ్ల కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇండిపెండెన్స్ డే పరేడ్ రూట్ ప్రాంతంలో” కాల్పులు జరిగినట్లు లేక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు.. ‘షూటర్ ఉన్నాడు, షూటర్ ఉన్నాడు, షూటర్ ఉన్నాడు’ అని చెప్పడం ప్రారంభించారు. అక్కడ ఉండటం సురక్షితం కాదని ఆ ప్రాంతంలోని పోలీసులు హాజరైన వారిని వెళ్లిపోవాలని సూచించారు.