విద్య, ఉద్యోగాల కోసం ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణలో టిఆర్ఎస్ నిర్లఖ్య వైఖరితో విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటు ఉపాధ్యాయుల నియామకాలుగాని అటు పదోన్నతులు గాని చేపట్టకపోవడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని విమర్శించారు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో విద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని పట్ట బద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియమాకాలు చేపట్టకపోవడంతో పాటు విద్య వాలంటీర్ల వ్యవస్థను తొలగించడంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండల విద్యాధికారుల పోస్టులు 485 ఉండగా, ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని మిగిలిన అన్ని పోస్టుల్లో ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగించారని దీంతో పూర్తి స్థాయిలో పాఠశాలపై గాని, ఉపాధ్యాయుల పర్యవేక్షణపై గాని శ్రద్ధ చూపలేకపోతున్నారని అన్నారు. కరోనాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేయగా వారిని పూర్తిగా తొలగించారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం సీఎం కేసీఆర్ కు విద్యా వ్యవస్థ పట్ల ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని విమర్శించారు ఉపాధ్యాయ నియామకాల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించినా, ఉపాధ్యాయ నియమకాలు ఎప్పుడు చేపడతారో ప్రభుత్వనికి తెలియని పరిస్థితి నెలకొందన్నారు
మన ఊరు మన బడి పథకం మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటనలు చేసినా నామమాత్రంగా పనులు కొనసాగుతున్నాయని జీవన్ రెడ్డి ఆరోపించారు. పాఠశాలల్లో స్కావెంజర్స్ స్వీపర్లను నియమించకపోవడంతో గ్రామపంచాయతీ సిబ్బందిపై భారం పడుతుందని దీంతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన దుస్థితి నెలకొంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వెంటనే స్కావెంజర్స్ ను స్వీపర్లను నియమించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యా వాలంటీలను కొనసాగించాలని అన్నారు.
గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమైనప్పటికీ శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించినప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇస్తుందని పాఠశాలల సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. మధ్యాహ్న భోజనం వేతనం I000నుండి 3000 రూపాయల పెంచి ఆరు నెలల గడుస్తున్న నేటికీ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. వెంటనే ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేయాలని, పూర్తిస్థాయిలో బోధనా సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన బోధనా అందించాలని, అప్పుడే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నిజమైన నివాళి అన్నారు.
ప్రెస్ మీట్ లో పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజెంగి నందయ్య,మండలాధ్యక్షుడు జున్ను రాజేందర్, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కండ్లపెళ్లి దుర్గయ్య, కాంగ్రెస్ నాయకులు గాజుల రాజేందర్,నక్క జీవన్, కండ్లపెల్లి రాదకిషన్, యూత్ నాయకులు లైసెట్టి విజయ్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.