Monday, February 24, 2025
HomeTrending Newsలోకేష్ పాదయాత్రకు రెండ్రోజులు బ్రేక్

లోకేష్ పాదయాత్రకు రెండ్రోజులు బ్రేక్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెండ్రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. లోకేష్ యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా  మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది.  రాయలసీమ తూర్పు నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎల్లుండి సోమవారం జరగనుంది.  చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు  ఈ  నియోజకవర్గం పరిధి కిందకు వస్తాయి.  దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగియనుంది.  ఎన్నికల నిబంధనల ప్రకారం రేపు,  ఎల్లుండి  ఈ జిల్లాల్లో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకూడదు. ఈ నేపథ్యంలో లోకేష్ యాత్రకు కూడా  నిలిపివేయనున్నారు.

Also Read : ఎవరు ముసలాయన: లోకేష్ ప్రశ్న

RELATED ARTICLES

Most Popular

న్యూస్