Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హాకీలో ఇండియాకు కాంస్యం

హాకీలో ఇండియాకు కాంస్యం

India gets Bronze : ఆసియా కప్-2020 మహిళల హాకీ టోర్నీలో ఇండియా కాంస్య పతకం సంపాదించింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో చైనాపై 2-0తో విజయం సాధించింది. ఆట 13వ నిమిషంలో షర్మిలాదేవి పెనాల్టీ కార్నర్ ద్వారా చేసిన గోల్ తో ఇండియా బోణీ చేసింది. ఆ కాసేపతికో 19వ నిమిషంలో కౌర్ గుర్మీత్ మరో పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి 2-0తో ఇండియా కు ఆధిక్యాన్ని సంపాదించింది.  ఆ తర్వాత చైనాను నిలువరిస్తూ చక్కటి పోరాట పటిమ చూపి గెలుగు సొంతం చేసుకుంది.

ఒమన్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియా ఈసారి సెమీస్ లో సౌత్ కొరియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.  నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జపాన్ 4-2 తో సౌత్ కొరియాను ఓడించి ఈ ఏటి విజేతగా అవతరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్