Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్చైనాపై ఇండియా ఘన విజయం

చైనాపై ఇండియా ఘన విజయం

India Landslide Victory: ఇండియా-చైనా జట్ల మధ్య నేడు జరిగిన మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ మ్యాచ్ లో ఇండియా7-1తో చైనాను ఓడించింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ 2021-22 లో భాగంగా ఐదో మ్యాచ్ ఇండియా-చైనా మధ్య జరిగింది. ఒమన్, మస్కట్ లోని సుల్తాన్ ఖబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలి పావు భాగంలో ఇండియా రెండు గోల్స్ సాధించింది. రెండో పావు భాగంలో రెండు జట్లూ గోల్స్ చేయలేకపోయాయి. మూడో పావు గంటలో ఇండియా-చైనా చెరో గోల్ సాధించాయి. ఈ సమయంలో ఇండియా 3-1 తో ఆధిక్యంలో నిలిచింది. 47,48, 50,52 నిమిషాల్లో ఇండియా వరుసగా నాలుగు గోల్స్ సాధించింది. దీనితో ఆట  ముగిసే సమయానికి ఇండియా 7-1తో తిరుగులేని విజయం సాధించింది.

ఇండియా సాధించిన ఏడింటిలో నాలుగు ఫీల్డ్ గోల్స్, మరో మూడు ఫీల్డ్ స్ట్రోక్స్ ద్వారా లభించాయి.

ఈ రెండు జట్ల మధ్యా రేపు రెండో మ్యాచ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్