Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్India Vs Ireland T20: ఏడు వికెట్లతో ఇండియా విజయం

India Vs Ireland T20: ఏడు వికెట్లతో ఇండియా విజయం

ఇండియా-ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న రెండు మ్యాచ్ ల టి-20 సిరీస్ మొదటి మ్యాచ్ లో ఇండియా ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది.  వర్షం కారణంగా మ్యాచ్ ను 12 ఓవర్లకే కుదించారు.

డబ్లిన్ లోని ద విలేజ్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. హ్యారీ టేక్టార్ 33 బంతుల్లో 6ఫోర్లు,3సిక్సర్లతో 64 ;  థక్కర్ 16 బంతుల్లో  2 సిక్సర్లతో 18 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 108పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా  30 పరుగుల వద్ద ఒకేసారి రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12బంతుల్లో  1ఫోర్,  3సిక్సర్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో  47 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఐర్లాండ్ బౌలర్లలో క్రెగ్ యంగ్ రెండు; జోసువా లిటిల్ ఒక వికెట్ పడగొట్టారు.

మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులే ఇచ్చి ఒక వికెట్ డగొట్టిన యజువేంద్ర చాహల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

రెండో మ్యాచ్ రేపు సాయంత్రం జరగనుంది.

ఉమ్రాన్ మాలిక్ తొలిసారి అంతర్జాతీయ టి 20 మ్యాచ్ ఆడాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్