Sunday, January 19, 2025
HomeTrending NewsIndia Vs NZ:  వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

India Vs NZ:  వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో మ్యాచ్ లో 90 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కగా, బౌలింగ్ లో శార్దూల్, కుల్దీప్  చెరో మూడు వికెట్లు పడగొట్టారు.  ఈ విజయంతో ఇండియా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో నిలిచింది.

ఇండోర్ లోనే హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 101;  గిల్ 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యారు.  ఓపెనర్లు తొలి వికెట్ కు 212 పరుగులు జోడించారు.  హార్దిక్ పాండ్యా-54;  కోహ్లీ-36; ఠాకూర్-25  పరుగులతో రాణించారు. దీనితో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, టిక్నర్ చెరో మూడు; బ్రేస్ వెల్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పరుగుల ఖాతా ప్రారంభించక ముందే తొలి వికెట్ (ఫిన్ అల్లెన్) కోల్పోయింది.  డెవాన్ కాన్వే- హెన్రీ నికోలస్ రెండో వికెట్ కు 106 పరుగులు చేశారు. నికోలస్ 42; ఆ తర్వాత డెరిల్ మిచెల్ 24 రన్స్ చేసి ఔటయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ డకౌట్ కాగా, గ్లెన్ ఫిలిప్స్ కేవలం 5 పరుగులే చేశాడు. 100 బంతుల్లో 12  ఫోర్లు, 8 సిక్సర్లతో 138 పరుగులు చేసిన కాన్వే ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. బ్రేస్ వెల్-26; ఫెర్గ్యూసన్-7 చేయగా జాకబ్ డఫ్ఫీ డకౌట్ అయ్యాడు. శాంట్నర్ 34 పరుగులు చేసి చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. 41.2 ఓవర్లలో 295 పరుగులకు కివీస్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కులదీప్ యాదవ్ 3, యజువేంద్ర చాహల్ 2;  హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్  చెరో వికెట్ పడగొట్టారు.

శార్దూల్ ఠాకూర్ ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’; శుభ్ మన్ గిల్  ‘మ్యాన్ అఫ్ ద సిరీస్’ దక్కించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్