చట్టోగ్రామ్ టెస్ట్ మ్యాచ్ లో విజయానికి ఇండియా నాలుగు వికెట్ల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 42 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు ఐదోరోజు ఆట మొదలు పెట్టిన బంగ్లాదేశ్ తొలి సెషన్ లో పైచేయి సాధించింది. ఓపెనర్లు ఇద్దరూ నిలకడగా రాణించి 30 ఓవర్లలో 77 పరుగులు చేశారు. లంచ్ తర్వాత ఆతిథ్య జట్టు తొలి వికెట్ (శాంటో-67) కోల్పోయింది. అక్షర్ పటేల్ బంగ్లా ఓపెనర్ల 124 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. యాసిర్ అలీ(5); లిట్టన్ దాస్ (19) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. టీ విరామానికి మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఆ తర్వాత బంగ్లా ఓపెనర్ జకీర్ ఖాన్ తన కెరీర్ లో తొలి టెస్ట్ సెంచరీ సాధించి అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు. ముస్తాఫిజుర్(23); నూరుల్ హాసన్(3)లను అక్షర్ అవుట్ చేశాడు.
నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ -40; హసన్ మిరాజ్- 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అక్షర్ మూడు; అశ్విన్, కుల్దీప్, ఉమేష్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇండియా విజయానికి మరో నాలుగు వికెట్లు అవసరం కాగా…. బంగ్లాదేశ్ ఇంకా 241 పరుగులు వెనకబడి ఉంది.
Also Read : Gill, Pujara Centuries: బంగ్లా ముంగిట భారీ లక్ష్యం