Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్Chess Olympiad:  ఇండియా తరఫున ఆరు టీమ్ లు

Chess Olympiad:  ఇండియా తరఫున ఆరు టీమ్ లు

తమిళనాడులోని మహాబలిపురంలో ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న 44వ చెస్ ఒలింపియాడ్ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 187 దేశాల నుంచి 188 జట్లు ఓపెన్ కేటగిరీలో, 162 మహిళల కేటగిరీల్లో ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.

అయితే మన దేశం నుంచి కూడా రికార్డు స్థాయిలో ఆటగాళ్ళు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నారు. ఓపెన్ కేటగిరీ, మహిళల కేటగిరీలో చెరో మూడు జట్లు … ఒక్కో జట్టులో ఐదుగురు చొప్పున మొత్తం 30 మంది ఆటగాళ్ళు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఒక్కో జట్టు నుంచి ఐదుగురు ఉండగా వీరిలో నలుగురు మాత్రమే ఆడతారు, సాధారణంగా కెప్టెన్ గా వ్యవహరించే వ్యక్తి  మిగిలిన వారికి గైడ్ గా ఉంటారు.

ఓపెన్ కేటగిరీ నుంచి….

టీమ్ -1:  విదిత్ గుజ్ రాతి, పి.హరికృష్ణ, అర్జున్ ఎరిగైసి, ఎస్ ఎల్ నారాయణ్, శశికిరణ్ కృష్ణన్

టీమ్ -2: నిహాల్ శరీన్, డి. గుకేష్, బి. అధిబన్, ఆర్. ప్రగ్నానంద, రౌనక్  సాద్వానీ

టీమ్ -3: సూర్య శేఖర్ గంగూలీ, ఎస్పీ సేతు రామన్, అభిజీత్ గుప్తా, కార్తికేయన్ మురళి, అభిమన్యు పురానిక్

మహిళల కేటగిరి నుంచి

టీమ్ -1: కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్ వైశాలి, తానియా సచ్ దేవ్, భక్తి కుల్ కర్ణి

టీమ్ -2: వంతిక అగర్వాల్, సౌమ్య స్వామినాథన్, మేరీ అన్ గోమేస్,  పద్మిని రౌత్, దివ్య దేశ్ ముఖ్

టీమ్ -3: ఈశా కరవాడే, సాహితీ వర్షిణి, ప్రత్యూష బొడ్డ, నందితా పీవీ, విశ్వా వష్ణవాలా

ఓపెన్ కేటగిరీలో ఉన్న 15 మంది ఆటగాళ్ళూ గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వారే కావడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్