Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్Team India: ఆసీస్, సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్

Team India: ఆసీస్, సౌతాఫ్రికాతో వైట్ బాల్ సిరీస్

అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగనున్న టి 20వరల్డ్ కప్ కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టి 20 మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో పర్యటిస్తోంది. నేడు (జూలై 22) రెండు జట్ల మధ్యా తొలి వన్డే జరగబోతోంది. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత స్వదేశంలో సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో మొహాలీ, నాగపూర్, హైదరాబాద్ స్టేడియాల్లో ఆస్ట్రేలియాతో  మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది.

ఆ వెంటనే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 మధ్య మరో మూడు టి 20 మ్యాచ్ లు సౌతాఫ్రికా జట్టుతో ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ లూ తిరువనంతపురం, గువహతి, ఇండోర్ లలో జరుగుతాయి. దీని తర్వాత మరో మూడు వన్డే మ్యాచ్ లు కూడా ప్రోటీస్ టీం తో ఇండియా ఆడనుంది. అక్టోబర్ 6నుంచి 11 మధ్య జరగనున్న ఈ మ్యాచ్ లకు రాంచీ, లక్నో, ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

సౌతాఫ్రికా సిరీస్ ముగియగానే వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పయనం కానుంది. అక్టోబర్ 19న మొదలు కానున్న టి 20పురుషుల వరల్డ్ కప్ షెడ్యూల్ నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular