Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Pandyaa show: తొలి టి 20లో ఇండియా విజయం

Pandyaa show: తొలి టి 20లో ఇండియా విజయం

ఇండియా –ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా ఘనవిజయం సాధించింది. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో తో అలరించి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

సౌతాంప్టన్ లోని ద రోజ్ బౌల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇండియా తొలి వికెట్ కు 29 పరుగులు (రోహిత్-24) చేసింది. ఇషాన్ కిషన్ 8పరుగులే చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా-51; సూర్య కుమార్ యాదవ్-39; దీపక్ హుడా-33 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు; టోప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 33పరుగులకే నాలుగు కీలక వికెట్లు (జేసన్ రాయ్-4; జోస్ బట్లర్-0; డేవిడ్ మిలాన్-21; లియాం లివింగ్ స్టోన్-0) కోల్పోయింది. మోయిన్ అలీ-; హ్యారీ బ్రూక్-; క్రిస్ జోర్డాన్- మాత్రమే పరుగులు రాబట్టగాలిగారు. 19.3 ఓవర్లలో  148 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు; ఆర్ష దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ చెరో రెండు;  భువనేశ్వర్ కుమార్, హర్షల్  పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

అద్భుత ప్రదర్శన తో రాణించిన హార్దిక్ పాండ్యా కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్