Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Rohit is back: రెండో టి20లో ఇండియా విజయం

Rohit is back: రెండో టి20లో ఇండియా విజయం

కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత తనదైన బ్యాటింగ్ తో అలరించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి 20 మ్యాచ్ లో ఇండియా 6 వికెట్లతో విజయం సాధించింది. రోహిత్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా దినేష్ కార్తీక్ ఒక సిక్సర్, ఒక ఫోర్ తో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం అందించాడు.

నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ను వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మ్యాచ్ ఆరంభించారు. టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా జట్టులో  మాథ్యూ వాడే-43 (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు); కెప్టెన్ పించ్-31 (15 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్) రాణించడంతో కేటాయించిన 8 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ రెండు, బుమ్రా ఒక వికెట్ సాధించారు. ఇద్దరు ఆసీస్ బ్యాట్స్ మెన్ రనౌట్ గా వెనుదిరిగారు.

లక్ష్య సాధనలో ఇండియా తొలి ఓవర్లోనే 20 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, రాహుల్ సిక్సర్లతో విరుచుకు పడ్డారు. తొలి వికెట్ కు 2.5 ఓవర్లలో 39 పరుగులు చేసింది. రాహుల్ 10; కోహ్లీ-11 పరుగులు చేసి ఔటయ్యారు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఈ మూడు వికెట్లు జంపాకే దక్కాయి. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దినేష్ కార్తీక్ కెప్టెన్ రోహిత్ తో కలిసి విజయం అందించాడు.

జంపా కు మూడు, కమ్మిన్స్ కు ఒక వికెట్ దక్కింది.

రోహిత్ శర్మకే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

మూడు మ్యాచ్ ల సిరీస్ ­ ప్రస్తుతం 1-1తో డ్రా  అయ్యింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడవ మ్యాచ్ హైదరాబాద్ లో ఆదివారం జరగనుంది.

Also Read : India Vs Australia: మొదటి టి20లో ఆసీస్ అద్భుత విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్