Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్India Vs. England: ఇండియాదే టి 20 సిరీస్

India Vs. England: ఇండియాదే టి 20 సిరీస్

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను ఇండియా గెల్చుకుంది. మొన్న జరిగిన తొలి మ్యాచ్ లో 50 పరుగులతో నెగ్గిన ఇండియా నేడు జరిగిన రెండో మ్యాచ్ లో 49 పరుగులతో విజయం సాధించి ­2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. నేటి మ్యాచ్ లో రవీంద్ర జడేజా-46 పరుగులతో (29బంతులు, 5 ఫోర్లు) నాటౌట్ గా నిలిచి బ్యాటింగ్ లో సత్తా చాటగా…. భువీ, చాహల్, బుమ్రాలు బౌలింగ్ లో రాణించి గెలుపులో కీలకపాత్ర పోషించారు, 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 17 ఓవర్ల్లలో 121 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 49 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. స్కోరు 61 వద్ద విరాట్ కోహ్లీ(1); ఓపెనర్ గా దిగిన రిషభ్ పంత్ (26) ఇద్దరూ ఔటయ్యారు. మళ్ళీ స్కోరు 89 వద్ద సూర్య కుమార్ యాదవ్ (15); హార్దిక్ పాండ్యా (12) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. దినేష్ కార్తీక్; హర్షల్ పటేల్; భువనేశ్వర్ కుమార్ కు కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. జడేజా రాణించడంతో ఇండియా గౌరవప్రదమైన స్కోరు(నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు) చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు; రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు పడగొట్టారు.

పరుగుల ఖాతా తెరవక ముందే ఇంగ్లాండ్ తొలి వికెట్ (జేసన్ రాయ్) కోల్పోయింది. ఆ కాసేపటికే జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. జట్టులో మొయిన్ అలీ-35 పరుగులు చేసి అవుట్ కాగా; డేవిడ్ విల్లె-33తో నాటౌట్ గా నిలిచాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో  భువీ మూడు; బుమ్రా, చాహల్ చెరో రెండు; పాండ్యా, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.

భువనేశ్వర్ కుమార్ కు’ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్