ఉప్పల్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా- ఇండియా మధ్య మూడు టి 20మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆఖరి మ్యాచ్ నేడు ఉప్పల్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్ ల అనంతరం 1-1 తో ఇరు జట్లూ సమంగా ఉన్నాయి, ఈ మ్యాచ్ లో విజయం ద్వారా సిరీస్ ను గెల్చుకోవాలని ఇరు జట్లూ ఉవ్విళ్లూరుతున్నాయి. వర్షం కారణంగా నాగపూర్ లో జరిగిన రెండో మ్యాచ్ ఎనిమిదేసి ఓవర్ల చొప్పున మాత్రమే ఆట సాగింది. దీనితో క్రికెట్ ప్రేక్షకులు నిరాశ పడ్డారు. హైదరాబాద్ లో నేడు వాతావరణం పొడిగానే ఉండడంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలే ఉన్నాయి.
భారత జట్టులో ఒక మార్పు చేసినట్లు కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు. నాగపూర్ మ్యాచ్ లో నలుగురు బౌలర్ల అవసరం మాత్రమే ఉండడంతో భువీని పక్కన పెట్టామని, ఈ మ్యాచ్ లో అతన్ని జట్టులోకి తిరిగి తీసుకున్నామని, రిషభ్ పంత్ ను తప్పించామని రోహిత్ వెల్లడించాడు. ఆసీస్ జట్టులో కూడా సీన్ అబ్బేట్ స్థానంలో జోస్ ఇంగ్లిస్ జట్టులో చేరాడు.
Also Read: Womens Asia Cup T20 2022 : మలేషియాపై ఇండియా విజయం