Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్Womens Asia Cup T20 2022 : మలేషియాపై ఇండియా విజయం

Womens Asia Cup T20 2022 : మలేషియాపై ఇండియా విజయం

బంగ్లాదేశ్ లో జరుగుతోన్న మహిళల ఆసియా కప్ టి 20 టోర్నమెంట్ లో మలేషియాపై  ఇండియా విజయం సాధించింది.  అయితే … ఇండియా విసిరిన భారీ లక్ష్య చేదనలో బరిలోకి దిగిన  మలేషియా  16 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో  వర్షం పడి ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనితో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఇండియా ౩౦ పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.

మలేషియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా తొలి వికెట్ కు 116పరుగుల చక్కని భాగస్వామ్యం నమోదు చేసింది. సబ్బినేని మేఘన 53 బంతుల్లో11 ఫోర్లు, 1సిక్సర్ తో69 ; షఫాలీ వర్మ 39 బంతుల్లో1  ఫోర్ 3 సిక్సర్లతో 46 పరుగులు చేశారు.  రిచా ఘోష్ 19 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్సర్ తో33;   హేమలత నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 10 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి  181 పరుగులు చేసింది.

మలేసియా కెప్టెన్ దురైసింగం, స్యుహద చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

పరుగుల ఖాతా ప్రారంభించక ముందే మలేసియా తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద మరో ఓపెనర్ జూలియా కూడా వెనుదిరిగింది. 5.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 16పరుగుల వద్ద వాన అంతరాయం కలిగించింది.

సబ్బినేని మేఘన కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read: Malaysia Open : మలేషియా ఓపెన్ లో శుభారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్