Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్వాక్సిన్ తీసుకున్న బుమ్రా

వాక్సిన్ తీసుకున్న బుమ్రా

భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ బుమ్రా కోవిడ్ వాక్సిన్ తోలి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని బుమ్రా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ‘వాక్సిన్ తీసుకున్నా… అందరూ క్షేమంగా వుండాలి’ అంటూ కామెంట్ పెట్టారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారాలు నిన్న సోమవారం వాక్సిన్ తోలిడోసు తీసుకున్నారు. మరికొందరు ఆటగాళ్ళు శిఖర్ ధావన్, రేహానే, ఉమేష్ యాదవ్ లకు గత వారం వాక్సిన్ పూర్తయ్యింది.

ఐ సి సి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడేందుకు జూన్ 2న భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ కు పయనమవుతోంది. మొదట లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరపాలనుకున్నా కోవిడ్ నేపధ్యంలో వేదికను సౌతాంఫ్టన్ కు మార్చారు. ఆటగాళ్లకు ఇంగ్లాండ్ లోనే రెండో డోస్ వేయించేందుకు బిసిసిఐ ప్రయత్నాలు చేస్తోంది, ఇంగ్లాండ్, న్యూ సౌత్ వేల్స్ క్రికెట్ బోర్డులను సంప్రదిస్తోంది. లేని పక్షంలో ఇండియా నుంచే వాక్సిన్ తీసుకెళ్ళి ఇవ్వాలని భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్