Saturday, January 18, 2025
Homeసినిమాసెన్సార్ కార్యక్రమాల్లో 'ఇన్ సెక్యూర్'

సెన్సార్ కార్యక్రమాల్లో ‘ఇన్ సెక్యూర్’

ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో చేబ్యం కిరణ్ శర్మ సహకారంతో అదిరే అభి (అభినవ కృష్ణ), ఆమీక్షా పవార్, ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న‌ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ “ఇన్ సెక్యూర్”.  సత్యనారాయణ ఏకారి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ “తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా ఈ చిత్రం నిర్మించాం. ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో ‘సీతారామం’ ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు. ఈ నెలలో సెన్సార్ పూర్తి చేసి అక్టోబర్ మూడోవారంలో రిలీజ్ చేద్దామనుకొంటున్నాం. మా బ్యానర్లో ఇది నాలుగో చిత్రం. గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం. గత చిత్రలాగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్