Saturday, January 18, 2025
HomeTrending Newsఅంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

అంతర్రాష్ట్ర బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీల కోసం ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కోరుతున్నారు. ఉద్యోగుల కోరికను మన్నించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేసి బదిలీ కోరుతున్న ఉద్యోగుల వివరాలు సేకరించాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 1338 మంది ఉద్యోగులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలతో జిఏడి రాష్ట్ర పునర్విభజన శాఖ వారు ప్రతిపాదన రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదం కోసం పంపడం జరిగింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఇరు రాష్ట్రాల మధ్య బదిలీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

తదుపరి ఈ ప్రతిపాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే అప్పుడు బదిలీలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపడుతారు. అలాగే తెలంగాణకు బదిలీ కోరుకునే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇపుడు NOC ఇస్తుంది. అలాగే త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీలలో తప్పనిసరి బదిలీకి ఎనిమిది సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్