Sunday, November 24, 2024
HomeTrending Newsభారత్ లో తొలి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం

భారత్ లో తొలి అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం

భారతదేశంలో తొలిసారిగా అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారు. త్రిపురలోని సబ్రూమ్‌లో కొత్త ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. థాయ్‌లాండ్, మయన్మార్ ,బంగ్లాదేశ్‌తో సహా ఏడు దేశాల ప్రతినిధుల సమక్షంలో దక్షిణ కొరియాలోని ప్రపంచ బౌద్ధ పోప్ ఆర్గనైజేషన్ ,మెయిన్ మాంక్ షాక్యా గసన్ శంకుస్థాపన చేశారు.

దలైలామా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన ఒక సందేశం పంపారు. “త్రిపురలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి యూనివర్సిటీలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని” ఆయన అన్నారు. “భారతదేశ చిరకాల సంప్రదాయాలను మరింత ప్రసిద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్రను నిర్వర్తిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గసాన్ మాట్లాడుతూ.. ‘కరుణ’, ‘అహింస’ వంటి బౌద్ధ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందిస్తున్నందుకు భారతదేశానికి కృతజ్ఞతలు” అని అన్నారు.

“కొరియా యుద్ధ సమయంలో, మన సైనికులకు మందులు ,డాక్టర్లను పంపడం ద్వారా భారతదేశం దక్షిణ కొరియా వెనుక నిలిచింది, మేము దానిని తిరిగి చెల్లించాలి” అని ఆయన చెప్పారు. బహుజన్ హితాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (BHET) ద్వారా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది.

31దేశాల విద్యార్థులు ప్రతిపాదిత వర్సిటీలో బౌద్ధ సాహిత్యం, సంస్కృతి ,సంప్రదాయాలను అధ్యయనం చేయడంతో పాటు పరిశోధన చేయడానికి వీలుకలుగుతుంది. అంతేకాకుండా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెడికల్, టెక్నికల్, జనరల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసే యోచన కూడా ఉందని అధికారులు తెలిపారు. ధమ్మ దీప అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం బిల్లు 2022ని రాష్ట్ర అసెంబ్లీ సెప్టెంబర్‌లో ఆమోదించింది. యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 25.28 ఎకరాల భూమిని రూ.75.84 లక్షలకు ఇవ్వగా, ట్రస్టు మరో 100 ఎకరాల భూమిని కోరింది.

ఈ కార్యక్రమంలో బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే శంకర్‌రాయ్‌, బీహెచ్‌ఈటీ వ్యవస్థాపక చైర్మన్‌ దమ్మపియా తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్‌లో బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ హామీ ఇచ్చారని రాయ్ చెప్పారు. ఈ కార్యక్రమం నిజంగా చారిత్రాత్మకమని, మాజీ ముఖ్యమంత్రి హామీని నెరవేర్చే తొలి అడుగు అని, వర్సిటీ కేవలం బౌద్ధమతంపై దృష్టి పెట్టడమే కాకుండా మెడికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ కోర్సులను ఆఫర్ చేస్తుందని తెలిపారు. అనంతరం దమ్మప్పయ్య విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సౌకర్యం కల్పిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. “BHET, ఒక NGO… ఈ ప్రాజెక్ట్‌కు నిధులు సమకూరుస్తుంది. దీనికి విరాళాలు ఇవ్వడానికి అందరికీ స్వాగతం” అని ఆయన అన్నారు. 40 లక్షల జనాభా ఉన్న త్రిపురలో దాదాపు 50వేల మంది బౌద్ధులు నివసిస్తున్నారు. మోగ్, ఉచోయ్, చక్మా వర్గాల ప్రజలు సాంప్రదాయకంగా అతిధులకు స్వాగతం పలికారు.

సబ్రూమ్‌లోని మను బకుల్ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ (CHT) సమీపంలో ఉంది, ఇది గణనీయమైన బౌద్ధ జనాభాకు నిలయంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)అండ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ కాకుండా, త్రిపుర విశ్వవిద్యా లయం MBB విశ్వవిద్యాలయం అండ్ ప్రైవేట్ యాజమాన్యంలోని ICFAI విశ్వవిద్యాలయం అనే రెండు విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్