Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణ విత్తన రంగంలో మరో మైలు రాయి

తెలంగాణ విత్తన రంగంలో మరో మైలు రాయి

Tista : తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన రంగ అభివృద్దిని, విత్తన వాణిజ్యాన్ని మరింత పెంపొందించి, ప్రపంచ విత్తన పటంలో రాష్ట్రం అగ్ర భాగాన నిలవటానికి అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ ఎంతగానో దోహదపడనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ త్వరలోనే ప్రారంభమై అందుబాటులోకి రానున్నదన్నారు. ఈ ల్యాబ్ తెలంగాణలో వాడుకలోకి వస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తన మొలకశాతం, తేమ శాతం, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత లాంటి నాణ్యతా పరీక్షలతో పాటు సింగల్ విండో పద్దతిన విత్తన ఎగుమతికి సంబందించిన అన్ని రకాల విత్తన ఆరోగ్య పరీక్షలు, జన్యు పరీక్షలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ అంతర్జాతీయ స్థాయి సంస్థలైన ISTA, OECD, ISF, UPOV, FAO సంబంధాలు మెరుగుపరచుకొని విత్తన రైతులకు, విత్తనోత్పత్తి దారులకు అంతర్జాతీయ విత్తన ప్రముఖులచే నాణ్యమైన విత్తనోత్పత్తి, అంతర్జాతీయ విత్తన దృవీకరణ, విత్తన నమూనాలా సేకరణ, విత్తన పరీక్ష పద్దతులపై పలు వర్క్ షాప్ లు, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహిస్తూ రాష్ట్ర విత్తన రంగమే కాకుండా, దేశ విత్తన రంగ అభివృద్దికి కూడా తోడ్పాటు అందించటానికి అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ హంగులతో “తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం” (Telangana International Seed Testing Authority-TISTA) పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాల నిర్మించిన రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ. పంటల దిగుబడి & వ్యవసాయ ఉత్పత్తిని పెంచటంలో నాణ్యమైన విత్తనం అనేది కీలక పాత్ర పోషిస్తుంది, ఈ నేపథ్యంలో, విత్తనం నాణ్యమైనదా కాదా అని నిర్ధారించి, రైతులను నాసిరకం విత్తనాల బెడద నుంచి కాపాడడానికి విత్తన పరీక్ష అనేది అత్యంత ముఖ్య ఘట్టం. ఈ విధంగా విత్తన పరీక్ష అనేది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన ఒక ప్రత్యేకమైన ప్రక్రియ.

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతుండటం దృష్ట్యా, విత్తన ఎగుమతికి సంబందించి అన్ని పరీక్షలు చేసి విత్తనోత్పత్తిదారులకు సేవలు అందించడానికి వీలుగా, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన విత్తన పరీక్షా యాత్రాలను సమకూర్చి ఏడు కోట్ల వ్యయంతో ISTA విత్తన పరీక్ష ల్యాబ్ ను నిర్మించడం జరిగింది. గడిచిన నాలుగు సంవత్సరాలుగా ల్యాబ్ నిర్మాణం చేపట్టి, అధునాతన విత్తన పరీక్ష ప్రమాణాలను ఏర్పాటు చేసిన విత్తన దృవీకరణ సంస్థ.

అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలు సంస్థ (ISTA), స్విట్జర్లాండ్ గుర్తింపు కొరకు దరఖాస్తు చేసుకోగా, గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆడిటింగ్ లో భాగంగా అన్ని రకాల పరీక్షలు & విశ్లేషణలు నిర్వహించిన ఆడిటింగ్ టీమ్, అనంతరం ఫిబ్రవరి 9, 2022 న గుర్తింపు ఇస్తున్నట్లు ISTA సెక్రటేరియల్, స్విట్జర్లాండ్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 130 & ప్రైవేట్ రంగంలో 50 నోటిఫైడ్ విత్తన పరీక్ష ల్యాబ్ లు ఉన్నాయి. కానీ ఇందులో కేవలం 26 ల్యాబ్ లు ISTA లో భాగస్వామ్య ల్యాబ్ లు ఉండగా అందులో 8 ల్యాబులు మాత్రమే ISTA గుర్తింపు ను పొందాయి. ఈ విధంగా, దేశంలో ISTA గుర్తింపు ను పొందిన రెండవ ప్రభుత్వ రంగ ల్యాబ్ గా తెలంగాణ విత్తన పరీక్ష ల్యాబ్ పేరొందింది. వ్యవసాయ & విత్తన రంగ అభివృద్ధ్యే లక్ష్యంగా గత సంత్సరం నవంబర్ లో విత్తన పరిశ్రమల సమగ్ర అభివృద్దిపై “అంతర్జాతీయ విత్తన సదస్సు” లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి – అంతర్జాతీయ ఆహార సంస్థ (FAO).

ప్రపంచ దేశాలలో విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు జరిపి విత్తన పరీక్ష పద్దతులు, ప్రమాణాలను రూపొందించే అంతర్జాతీయ స్థాయి సంస్థ గుర్తింపు తెలంగాణ విత్తన ల్యాబ్ కు రావటం ఎంతో సంతోషంగా ఉందని  తెలంగాణ విత్తన దృవీకరణ సంస్థ సంచాలకులు డా. కేశవులు అన్నారు. తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారం తీర్చిదిద్దటానికి, ఇలాంటి అంతర్జాతియ స్థాయి గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్