Highlight: ‘బాహుబలి’తో చరిత్ర సృష్టించిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమా పై సామాన్య ప్రేక్షకుల్లో సైతం అంచనాలు ఆకాశమే హద్దు అనేలా ఏర్పడ్డాయి. భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఆర్ఆర్ఆర్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మరింత ఆసక్తిగా మారింది.
ఇది ఒక యాక్షన్ డ్రామా. సినిమాలో రొమాంటిక్ సీన్లకి చోటు లేదు. డ్యూయెట్స్ ఉండవు. మరి అంతా ఫైట్లేనా? అంటే.. ఈ సినిమాలో ఎమోషన్ ముఖ్యం. ఫైట్ సన్నివేశాల్లోనూ ఎమోషన్ ఉంటుంది. సినిమా మొత్తం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉంటారు. వారి స్నేహం, వారి లక్ష్యం ఈ కథకి బలం అని రాజమౌళి ఒక ఇంటర్ వ్యూలో చెప్పారు. ఇక రామ్ చరణ్ ఇంట్రడక్షన్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ తో పాటు రెండు ఫైట్స్ ఈ సినిమాకి హైలెట్ అవుతాయి అనే మాట వినిపిస్తోంది.
ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సినిమా మొత్తానికే ఆకర్షణగా నిలుస్తుందట. ఛత్రపతి కానీ, మగధీర కానీ, బాహుబలి కానీ… రాజమౌళి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సినిమాలో కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని సమాచారం.
Also Read : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ట్రిపుల్ ఆర్ టీమ్