Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్రాజస్థాన్ పై ఘన విజయం: ప్లే ఆఫ్ కు కోల్ కతా

రాజస్థాన్ పై ఘన విజయం: ప్లే ఆఫ్ కు కోల్ కతా

ఐపీఎల్ ఈ సీజన్ లో కోల్ కతా దాదాపు ప్లే ఆఫ్ చేరినట్లే. నేడు ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ముంబై భారీ విజయం నమోదు చేస్తేనే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ముంబై ఆట తీరు గమనిస్తే దాదాపు ఆ పరిస్థితి కనబడడంలేదు. కాబట్టి కోల్ కతా నాలుగో స్థానంలో నిలిచి బెర్త్ ఖరారు చేసుకున్నట్లే.

రాజస్థాన్ రాయల్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ రాణించడంతో 86 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్లతో పాటు మెరుగైన రన్ రేట్ సాధించింది.  షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శ్యామ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలక మ్యాచ్ లో కోల్ కతా బ్యాట్స్ మెన్ రాణించారు. ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ లు తొలి వికెట్ కు 79 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయ్యర్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ రానా-12; రాహుల్ త్రిపాఠి-21, దినేష్ కార్తీక్-14; మోర్గాన్-13 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ వికెట్ల పతనం మొదటి ఓవర్ నుంచే ఆరంభమైంది. ఓపెనర్ యశస్వి డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సంజూ శ్యామ్సన్ కేవలం ఒకే పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో లివింగ్ స్టోన్, రావత్ లను కోల్ కతా బౌలర్ ఫెర్గ్యుసన్ ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు.  రాజస్థాన్ లో రాహుల్ తెవాటియా-44 (36 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు); శివం దూబే-18  మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయారు. దీనితో రాజస్థాన్ 16.1 బంతుల్లో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నాలుగు కీలక వికెట్లు తీసిన శివం మావి కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్