Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్ : మళ్ళీ కరోనా కలకలం

ఐపీఎల్ : మళ్ళీ కరోనా కలకలం

ఐపీఎల్ లో మళ్ళీ కరోనా కలకలం రేగింది. సన్ రైజర్స్ ఆటగాడు నటరాజన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో వెంటనే అతణ్ణి ఐసోలేషన్ కు తరలించారు. అతడితో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురిని కూడా ఐసోలేషన్ లో ఉంచారు. వీరిలో ఆటగాడు, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తో పాటు జట్టు మేనేజర్ విజయ్ కుమార్; ఫిజియో థెరపిస్ట్ శ్యామ్ సుందర్; డాక్టర్ అంజనా వన్నం; లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్; బౌలర్ పెరియార్ గణేషన్ లు ఉన్నారు.

నటరాజన్ కు సన్నిహితంగా మెలిగిన జట్టు సభ్యులు, సిబ్బందితో పాటు, ఢిల్లీ జట్టు సభ్యులందరికీ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటలకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించామని, అందరి రిపోర్టులు నెగెటివ్ వచ్చాయని ఐపీఎల్ అధికారి ఒకరు వెల్లడించారు. దీనితో నేటి సాయంత్రం ఢిల్లీ  క్యాపిటల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ కొనసాగుతుందని ప్రకటించాడు.

కోవిడ్ తీవ్రత కారణంగానే ఏప్రిల్ లో మొదలైన ఐపీఎల్ సీజన్ మే 4న వాయిదా పడిన సంగతి విదితమే. నాలుగు నెలల అనంతరం ఈ టోర్నీ దుబాయ్, ఒమన్ వేదికగా మొన్న ఆదివారం (సెప్టెంబర్ 19) పునః ప్రారంభమైంది. గత మూడు రోజులుగా మ్యాచ్ లు జరుగుతూ వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్