టి 20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఐర్లాండ్ 6 వికెట్లతో అపూర్వమైన విజయం నమోదు చేసింది. స్కాట్లాండ్ విసిరిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ పది ఓవర్లు ముగిసే నాటికి 65 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. కర్టిస్ కాంపర్- జార్జ్ డాక్ రెల్ లు ఐదో వికెట్ కు అజేయమైన 119 పరుగులు జోడించి మరో ఓవర్ మిగిలి ఉండగానే అద్భుత విజయం అందించారు. కాంపర్ 32 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లతో 72; డాక్ రెల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ తో 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
హోబర్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఒక్క పరుగుకే మున్షీ (1) ఔటయ్యాడు. మరో ఓపెనర్ మైఖేల్ జోన్స్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 4సిక్సర్లతో 86 పరుగులు చేశాడు. కెప్టెన్ బెర్రింగ్ టన్-37; క్రాస్-28 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లకు 176 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంపర్ రెండు; జోసువా లిటిల్, మార్క్ అడైర్ చెరో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ తొలి వికెట్ (కెప్టెన్ అండ్రూ బెల్ బెర్నీ 14) కు 27 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్-8; లార్కాన్ టకర్-20; హ్యారీ టెక్టార్-14 పరుగులు చేసి వెనుదిరిగారు. ఈ దశలో కాంపర్-డాక్రెల్ లు నిలదొక్కుకుని 11వ ఓవర్ నుంచి ప్రతాపం చూపి గెలిపించారు. కాంపెర్ విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టడంతో ఐర్లాండ్ ర్లాండ్ 180 స్కోరు చేసింది.
ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన కాంపర్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.