Saturday, January 18, 2025
Homeసినిమానాగశౌర్య పాదయాత్ర హిట్టు పట్టుకొచ్చేనా?

నాగశౌర్య పాదయాత్ర హిట్టు పట్టుకొచ్చేనా?

ఒక సినిమాను నిర్మించడం వేరు .. దానిని జనంలోకి తీసుకుని వెళ్లడం వేరు. సినిమా బాగున్నప్పటికీ సరైన ప్రమోషన్స్ లేక ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువలన ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి కొత్త కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ తరం హీరోలు యూత్ ఆడియన్స్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అందువలన సినిమా రిలీజ్ కి ముందు ఇంజనీరింగ్ కాలేజ్ లకి వెళ్లి అక్కడి ఆడిటోరియమ్స్ లో హడావిడి చేస్తున్నారు. క్యాంపస్ లకి వెళ్లడం కామన్ అయిపోయింది అనుకున్నాడేమో నాగశౌర్య నేరుగా జనం మధ్యలోకి వెళ్లిపోయాడు.

తాను హీరోగా .. తన  సొంత బ్యానర్లో నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి‘ సినిమా చేశాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను ప్రమోట్  చేసుకోవడం కోసమే నాగశౌర్య పాదయాత్ర చేశాడు. పాపం ఎండలను కూడా లెక్కచేయకుండా బాగానే తిరిగాడు. జనాలు మీదపడిపోతున్నా విసుక్కోకుండా సహనం చూపించాడు. ఒక సినిమా కోసం పాదయాత్ర చేసిన తొలి హీరో నాగశౌర్యనే అనుకోవాలి. పాదయాత్ర కారణంగా నాగశౌర్య ఎంతగా అలసిపోయాడనేది  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయనను చూడగానే అర్థమైపోయింది.

నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. యాక్షన్ సినిమాలు కలిసిరాలేదని అనుకుందామంటే, ‘వరుడు కావలెను’ వంటి లేడీస్ ఫాలోయింగ్ ఉండే సినిమా కూడా దెబ్బకొట్టేసింది. ఇక సొంత బ్యానర్లో ఆయన చేసిన సినిమాల వలన, నిర్మాణం పరంగా కూడా అంత వర్కౌట్ కాలేదు. అందువలన ఈ సారి తన సినిమాకి నాగశౌర్య గట్టిగానే ప్రమోషన్స్ చేశాడు. ఈ సినిమా జనం దృష్టిలోకి బాగానే వెళ్లింది .. ఇక ఉండవలసింది కథలో దమ్ము. అది ఉంటే నాగశౌర్య నుంచి ఈ సారి హిట్ తప్పించుకోలేదు. ఈ సినిమా హిట్ అయితే పాదయాత్ర పేరుతో మరికొంతమంది యంగ్ హీరోలు జనంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Also Read నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి టీమ్ పాదయాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్