గత ఆరు నెలలుగా .. అదిగో వేవ్ .. ఇదిగో వేవ్ అంటూ భయపెడుతూ వస్తూన్న మీడియా .. దీన్ని నమ్మి భయం గుప్పిట్లో కొంత మంది ! చివరకి వచ్చిందా ? వస్తే అంత తొందరగా ముగిసిపోబోతోందా ? అసలు తెలంగాణలో రాలేదా ? ఆంధ్ర ప్రదేశ్ సంగతి ఏంటి ? వేవ్ అంటే కేవలం కేసులు పెరగడమేనా ? కేసులు అంటే కేవలం అంకెలేనా ? వేవ్ అంటే అంబులెన్సుల సైరెన్ లు .. ఆసుపత్రిలో చేరికలు. మరణాలు.. ఈ విధంగా చూస్తే అసలు ఇది వేవ్ కానే కాదు. కేవలం ఉత్తుత్తి కేసులు.. ఆసుపత్రిలో చేరికలు పెద్దగా లేవు .. మరణాలు కూడా లేవు. కేవలం కేసులనే వేవ్ అంటే ఇది వేవ్ కిందే లెక్క
అసలు ఆసుపత్రిలో చేరికలు లేవా ?
కరోనా { ఓమిక్రాన్ } సోకి ఆసుపత్రికి వెళ్లడం వేరు. కిడ్నీ డయాలిసిస్ కోసమో, హార్ట్ సర్జరీ కోసమో మరో అనారోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళితే టెస్ట్ చేసి నప్పుడు కరోనా సోకినట్టు బయటపడితే ఆ వ్యక్తిని అక్కడ చేర్చుకొని కరోనా వల్ల ఆసుపత్రి లో చేరినట్టు లెక్క వేస్తారు. ఇలా ఆసుపత్రిలో చేరిన వారే అధిక శాతం. దీనికి తోడు ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో సంపన్న వర్గాలు, నాగరికుల్లో కరోనా భయం చాలా ఎక్కువ. మనం భయం అంటే వారు అవగాహన అంటారు. జలుబు చేసినా ఉలిక్కి పడడం, వెంటనే టెస్ట్ చేసుకోవడం, కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆసుపత్రిలో చేరడం ఇలాంటివి నయా సంపన్న వర్గాల నయా ట్రెండ్. అందుకే ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో కొద్దీ పాటి ఆసుపత్రి చేరికలు కనిపించాయి. కానీ అధిక శాతం బెడ్స్ ఖాళీగానే ఉండిపోయాయి.
మరణాలు లేవా ?
ఇప్పుడు వచ్చినవి కేవలం ఓమిక్రాన్ కేసులు కావు. తక్కువ శాతంలో డెల్టా కేసులు కూడా ఉన్నాయి. ఓమిక్రాన్ వల్ల మరణించిన వారు దాదాపుగా ఎవరూ లేరు. ఒక వ్యక్తి గుండెపోటుతోనో కాన్సర్ తోనో మరణిస్తే ఆ వ్యక్తి మరణానికి ముందు టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే దాన్ని కరోనా మరణంగా లెక్కిస్తారు. అలాంటి మరణాలు వున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఓమిక్రాన్ తో మరణించిన వారు మన దేశం లో ఒక్కరే. మన దేశంలో ఈ నెల రోజుల్లో కొన్ని కోట్ల మందికి ఓమిక్రాన్ సోకింది అనేది వాస్తవం. ఈ పరంగా చూస్తే ఆసుపత్రి చేరికలు ఎన్ని ? మరణాలు ఏవి ?
ఇది గ్రామీణ ప్రాంతాలకు విస్తరించదా ?
ఈ వేవ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రధానంగా పట్టణ ప్రాంతాలకు పరిమితం. ఎందుకిలా ? ఆరోగ్యం బాగాలేక పొతే ఆసుపత్రికి పోవాలి. ఇది సహజం. ఒకటి రెండు సార్లు తుమ్ములు, కాస్త గొంతులో గరగర వస్తే ఉలిక్కి పడి” వామ్మో నాకు కరోనా వచ్చేసి నట్టుంది. వస్తే నా గతి ఏంటి దేవుడా ?” అని భయంతో టెస్ట్ లు చేయించుకునే స్థితి పట్టణ వాసుల్లోనే ఉంది. ఎక్కడైతే టెస్ట్ లు ఎక్కువ చేసుకున్నారో అక్కడే కేసులు పెరిగాయి. వేవ్ వచ్చినట్టు కనిపించింది.
జలుబు , కాస్త గొంతు నొప్పి వస్తేనే వెంటనే వెళ్లి టెస్ట్ చేసుకొనే స్థాయి భయం, అంత డబ్బు, ఓపిక, సమయం… గ్రామీణ వాసుల్లో కనిపించదు. ఓమిక్రాన్ చాలా వేగంగా విసరిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వెళ్ళింది. కానీ అక్కడ ఎక్కువ కేసులు కనిపించవు. కారణం గ్రామీణ వాసులు టెస్ట్ ల కు పెద్దగా వెళ్లలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఉత్తుత్తి వేవ్ కేవలం అయిదు మెట్రోపాలిటన్ నగరాల వేవ్ . ముంబై , ఢిల్లీ , బెంగళూరు ,కోల్ కత, చెన్నై .. . ఎక్కడ ప్రజల్లో భయం ఉండి టెస్ట్ ల కోసం పరుగెట్టారో అక్కడే కేసులు కనిపించాయి.
ఈ వేవ్ ఎప్పుడు ముగుస్తుంది ?
ఈ వేవ్ ప్రత్యేకతలు రెండు .. 1 . పట్టణ ప్రాంతాలకు ముఖ్యంగా మెట్రో పోలిటన్ నగరాలకు పరిమితం. 2. ఈ వేవ్ రెండో ప్రత్యేకత ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ముగిసి పోతుంది. ముంబైలో కేసులు తగ్గుముఖం పట్టడం మొదలయ్యింది. ముందుగా ముంబైలో జనవరి 20 కల్లా కేసులు భారీగా తగ్గిపోతాయి. ఈ నెల చివరికల్లా మిగతా మెట్రో నగరాల్లో కూడా ఇదే స్థితి. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు తప్పించి మిగతా చోట్ల జనవరి చివరికల్లా ఈ ఉతుత్తి వేవ్ బాగా బలహీన పడి కేసులు బాగా తగ్గి పోతాయి.
కేసులు ఎప్పటికి జీరో కొస్తాయి ?
సున్నా కేసులు పరిస్థితి ఎప్పటికీ రాదు. ఈ వైరస్ ఇక్కడే ఉంటుంది. అది ఎక్కడికీ పోదు. నగర వాసులు భయం గుప్పిట్లో .. వీరు ఎన్ని బూస్టర్ డోసులు వేసుకున్నా అది ఆరు నెలలకు ఒకసారి సోకుతూనే ఉంటుంది. దాన్ని పట్టించుకోని వారికి అది ఒక సాధారణ జలుబు. దాన్ని చూసి భయపడే వారికి అదొక భూతం.
తెలంగాణలో వేవ్ ఎప్పుడు వస్తుంది ?
ఎప్పటికీ రాదు. తెలంగాణలో గత నెల రోజులుగా ఇన్ఫెక్షన్స్ జరిగాయి. ఉలిక్కి పడి ఆసుపత్రులకు పరుగెత్తిన వారు తక్కువ. అందుకే కేసులు పెద్దగా కపించలేదు. ఇప్పడు హైదరాబాద్ సిటీతో కలుపుకొని ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయి. అంటే కేసుల పరంగా చూసుకొంటే తెలంగాణలో వేవ్ రానట్టే. నిజమైన ఇన్ఫెక్షన్స్ పరంగా చూసుకొంటే అవి వచ్చాయి.. పోయాయి. ఇక వారం రోజుల్లో చాల మటుకు ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయే స్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ ఎంతైనా మెట్రో నగరం. ముంబై బెంగళూరు లాగే ఇక్కడ కూడా కాస్త తక్కువ స్థాయిలో అయినా కరోనా భయస్తులు వున్నారు. వారు టెస్ట్ లకు వెళ్లారు. అందుకే కాస్త కేసుల పెరుగుదల కనిపించింది. అదే జిల్లాల్లో అయితే ఆ స్థితి కూడా లేదు. జిలాల్లో కూడా ఇన్ఫెక్షన్స్ గత నెల కు పైగా జరుగుతున్నాయి. అక్కడ కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టడం మొదలయ్యింది.
మరి ఆంధ్ర ప్రదేశ్ సంగతి ?
ప్రజల్లో భయం మెడికల్ మాఫియా కు బంగారు బాతు. ప్రజల్లో భయం పోకుండా వీరు శత విధాలుగా ప్రయత్నిస్తారు. విజయవాడ, వైజాగ్ కేంద్రంగా ప్రజల్లో భయాన్ని పెంచి పోషించే ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి. వీరి ప్రచారాన్ని నమ్మిన వారు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొంటారు. ఇది గతం లో జరిగింది. ఇక పై కూడా జరుగుతుంది. కానీ మెజారిటీ తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. విష ప్రచారాన్ని నమ్మే స్థితి లో వారు లేరు. తెలంగాణ లాగే ఆంధ్ర ప్రదేశ్ కూడా. మరో నాలుగు అయిదు రోజులు ఏపీ లో కేసులు పెరగొచ్చు. ఏ నెల చివరికి మామూలు స్థితికి వచ్చేస్తుంది.
ఇన్ఫెక్షన్ లు జరిగి టెస్ట్ లు చేసుకోకపోతే నష్టం కదా ?
అవును .. ఫార్మసురులకు నష్టం. రెండో వేవ్ లో ప్రజల ఆస్తుల్ని దోచేసేసారు. ఇక ప్రజల దగ్గర ఏమీ మిగల లేదు. కరోనా లాక్ డౌన్ ల వల్ల , రెండో వేవ్ లో అధిక శాతం ఆసుపత్రుల దోపిడీ వల్ల ప్రజలు అప్పుల్లో వున్నారు. పెళ్ళాం పుస్తె లు తాకట్టు లో వున్నాయి. ఒట్టి పోయిన అవును పొదుగును పిండితే పాలు రాదు.. రక్తం వస్తుంది. నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, కొన్ని రకాల వ్యాపారాలు చేసే వారి ఆదాయాలు కరోనా కాలంలో తగ్గలేదు సరి కదా పెరిగాయి. వారి దగ్గరే డబ్బుంది. ఇప్పుడు ఫార్మసురుల టార్గెట్ వారే. అందుకే అక్కడే ఎక్కువ ప్రచారాలు.. కేసులు.
కరోనా సోకితే దాని ప్రభావం చాల రోజులు ఉంటుంది అనేది ఓమిక్రాన్ కు వర్తించదు. ఇప్పడు మన దేశంలో ఓమిక్రాన్ కోట్ల మందికి సోకింది. ఒకటి రెండు రోజుల జలుబు, కాస్త తల నొప్పి జ్వరంతో పోయింది. దీని ప్రభావం సోకిన వ్యక్తి పై ఎక్కువ కాలం ఉండదు. రోజూ ఆకుకూరలు, వెల్లుల్లి తీసుకోవడం, నీరు బాగా తాగడం, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం, నుదురుట చెమట పట్టేదాకా వేగంగా నడవం లాంటి చర్య ల ద్వారా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అధిగమించవచ్చు. ఆరోగ్యాన్ని పదిలంగా వుంచుకోవచ్చు.
మరి జనవరి కి కరోనా కథ ముగిసినట్టేనా ?
కరోనా కథ గత సంవత్సరం జూన్ కే ముగిసింది. అదిగో మూడో వేవ్.. ఇదిగో కొత్త వేరియంట్ అంటూ భయపెడుతూ వచ్చారు. ఫిబ్రవరి నుంచి నాలుగో వేవ్ కు ముహూర్తాలు పెట్టేస్తారు. అదిగో కొత్త వేరియెంట్.. వెయ్యి మ్యుటేషన్ లు అంటూ భయపెడుతూ వస్తారు. దీన్ని నమ్మిన వారు భయపడుతూ జీవితాన్ని చేజేతులురా నాశనం చేసుకొంటూ వుంటారు.
ముగింపు :
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో పెద్దగా భయందోళనలు లేవు. అందుకే ఇక్కడ పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంది. దీనికి కారణం ప్రజల్లో సరైన అవగాహహన. ప్రజల్లో సరైన అవగాహన తీసుకొని రావడం కోసం నా వంతు భాద్యతగా రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను.గత నాలుగు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు నడుస్తున్నాయి. అధిక శాతం ప్రజలు పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న టౌన్స్ లో అయితే వంద శాతం పిల్లలలు హాజరు. అదే బెంగళూరు నగరం. మూడో వేవ్ పిల్లలకు సోకుతుంది అనే ప్రచారాన్ని నమ్మారు. మొత్తం ఆన్లైన్ క్లాసులు. పాపం ఆ పిల్లలు. వారి చదువులు సర్వ నాశనం. బాల్యం బుగ్గి పాలు. ఆన్లైన్ క్లాసుల వల్ల తల నొప్పి అని చెబుతున్న పిలల్లు. కానీ ఫార్మసురుల విష ప్రచారాన్ని నమ్మి భయం గుప్పిట్లో చిక్కిన పట్టణ సంపన్న వర్గాలకు ఇది సమస్య అనిపించలేదు.
వీరి భయం కరోనా. వీరి ఉద్దేశం లో టెస్టింగ్ వద్దన్న వాడు.. బూస్టర్ డోసు వద్దన్న వాడు అనాగరికుడు. తెలియని వారికి చెప్పొచ్చు. తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటిని, ఇంటిని గుల్ల చేసుకొనే బాటలో మన దేశంలోని పట్టణ సంపన్న వర్గాలు ఉన్నాయి. వీరికి చెప్పేది ఎవరు ? చెప్పినా వారు నమ్మరు. ఇది నడుస్తున్న విషాద చరిత్ర. ఇంకా ముందు ముందు ఏమి చూడాల్సి వస్తుందో. వేసుకొన్న వాక్సిన్ లు చాలు. మంచి ఆహారం, వ్యాయామం అనే సహజ పద్దతి ద్వారా మీ ఇమ్మ్యూనిటి ని బలంగా ఉంచుకోండి . భయాన్ని పోగొట్టేందుకు నలుగురికీ అవగాహన కల్పించండి.
మాస్క్ లు అక్కర లేదు. వాక్సిన్ లు అక్కర లేదు. ఇప్పుడు కోవిద్ జలుబు లాంటి వ్యాధి .. యురోపియన్ దేశాలు. ముందుగా స్పెయిన్ నిర్ణయం. అదే దారిలో మిగతా దేశాలు. మన ప్రభుత్వాలు, మీడియా ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి.
ప్రజల కోసం సైన్స్… మనుషుల కోసం మందులు.
ఫార్మసురుల కోసం కాదు సైన్స్… మందుల కోసం మనుషులు కాదు.
– వాసిరెడ్డి అమర్నాథ్