Saturday, January 18, 2025
Homeసినిమాఅందాల భామ ఎందుకింత ఆలస్యం చేస్తున్నట్టు?!

అందాల భామ ఎందుకింత ఆలస్యం చేస్తున్నట్టు?!

శ్రీనిధి శెట్టి ఇంతవరకూ చేసింది రెండే సినిమాలు. ఆ సినిమాలే ‘కేజీఎఫ్ 1’ .. ‘కేజీఎఫ్ 2’. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం వలన .. సంచలన విజయాలను సాధించడం వలన ఈ బ్యూటీ తెలియనివారు లేరు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ కన్నడ బ్యూటీ ముందుగా కన్నడ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. అందాల పోటీల్లో అనేక బహుమతులను గెలుచుకున్న శ్రీనిధి, మోడల్ గా ఫుల్ బిజీ. అంతగా ఆమె ఆ ఫీల్డ్ లో రాణించడానికి కారణం ఆమె హైట్ .. అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం.

‘కేజీఎఫ్’ .. ‘కేజీఎఫ్ 2’ సినిమాలలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా, కథానాయిక స్థానంలో కనిపించడం వలన  సహజంగానే ఈ క్రెడిట్ ఆమె ఖాతాలోను చేరింది. అయితే మొదటి భాగానికీ .. రెండవ భాగానికి మధ్య చాలా గ్యాప్ ఉన్నప్పటికీ ఆమె చేసింది ఒక్క ‘కోబ్రా’ సినిమా మాత్రమే. ఈ సినిమాతోనే ఆమె తమిళ తెరకి పరిచయమవుతోంది. ఇది కాకుండా ఆమె పేరు మరే ప్రాజెక్టులోను వినిపించడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ కొత్త సినిమాల జాబితాలో కూడా ఈ సుందరి పేరు కనిపించడం లేదు.

శ్రీనిధి శెట్టికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ తో పాటు ఇతర భాషల నుంచి ఆఫర్లు భారీగానే వెళుతున్నాయట. కానీ ఆమె ఫలానా సినిమాను ఒప్పుకుందనే ప్రకటన మాత్రం కనిపించడం లేదు. అందుకు కారణం పారితోషికమా?  భారీ ప్రాజెక్టులు మాత్రమే చేయాలనే ఆలోచనా? లేదంటే స్టార్ హీరోల  సినిమాలు మాత్రమే ఒప్పుకోవాలనే నిర్ణయమా? అనేది అభిమానులకు అర్థం కావడం లేదు. ఈ నెల 31వ తేదీన ‘కోబ్రా’ విడుదలైన తరువాత ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : ‘కోబ్రా’ నా కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్: విక్రమ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్