Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్ఇషాన్ ‘డబుల్’ ధమాకా

ఇషాన్ ‘డబుల్’ ధమాకా

బంగ్లాదేశ్ తో జరుగుతోన్న మూడవ, చివరి వన్డేలో చిచ్చర పిడుగు ఇషాన్ కిషాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులతో దుమ్ము దులిపాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద లిట్టన్ దాస్ పట్టిన అద్భుత క్యాచ్ కు కిషన్ వెనుదిరిగాడు.

చట్టోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదురి స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్-ఇషాన్ లు ఓపెనర్లు గా బరిలోకి దిగారు. జట్టు స్కోరు 15 వద్ద మూడు పరుగులు చేసిన శిఖర్ హసన్ మిరాజ్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.

గత రెండు మ్యాచ్ ల్లో చోటు దక్కని ఇషాన్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగి తన బ్యాట్ పవర్ ఏమిటో మరోసారి రుచి చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.

  • ఇషాన్ కిషన్ కు ఇదే తొలి వన్డే సెంచరీ, తొలి డబుల్ సెంచరీ కూడా కావడం విశేషం
  • రెండో వికెట్ కు కోహ్లీ- కిషన్ లు రెండో వికెట్ కు 290 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు
  • ఇండియా నుంచి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ తర్వాత నాలుగో బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టించాడు.
  • ఇషాన్ కిషన్ ఔటయ్యే సమయానికి 5 ఒవర్లల్లో 305 పరుగులు చేసింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్