Sunday, January 19, 2025
HomeTrending NewsAditya-L1: ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో

Aditya-L1: ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో

ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కి. మీ దూరంలో ఉండి, పరిశోధనలు సాగిస్తుందని పేర్కొంది. ఇది సూర్యుడు-భూమి మధ్య ఉన్న దూరంలో 1% అని తెలిపింది. సూర్యుడు భారీ వాయుగోళం అని, దాని బాహ్య వాతావరణాన్ని ఆదిత్య-L1 అధ్యయనం చేస్తుందని వివరించింది. ఈ శాటిలైట్ సూర్యుడిపై ల్యాండ్ కాదని, సూర్యుడి దగ్గరకు కూడా వెళ్లదని స్పష్టం చేసింది.

సౌరగోళంలో సౌరగాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది. తిరుపతి జిల్లా అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం సరిగ్గా 11.50 గంటలకు ఆదిత్య – ఎల్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి -సి 57 వాహక నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్ళబోతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగవేదికకు చెందిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో రాకెట్‌ అనుసంధానం పనులు పూర్తయ్యాయి. రాకెట్ ప్రయోగానికి మిషన్ సన్నద్దతా సమావేశం పచ్చ జెండా ఊపింది. చంద్రయాన్-3 సక్సెస్ తో ఇస్రో సౌరగోళంలో రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. సౌర తుపాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇప్పటివరకు ఖగోళ శాస్త్రవేత్తల అంచనా.

ఈ ప్రయోగం ద్వారా అసలు సౌరగోళంలో వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఆదిత్య–ఎల్‌1 ను పంపుతోంది ఇస్రో. ఇందులోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ అనే పేలోడ్‌ 35 కేజీల బరువు ఉంటుంది. 200–400 ఎన్‌ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్‌ చిత్రాలను అందిస్తుంది. ఆదిత్య సోలార్‌ విండ్‌ పారిటకల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అనే పేలోడ్‌ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజీ సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది.

సోలార్‌ ఎనర్జీ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటరు సోలార్‌ కరోనా సమస్యాత్మకమైన కరోనల్‌ హీటింగ్‌ మెకానిజంను అధ్యయనం చేయడానికి, ఎక్స్‌–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది. హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ సౌర కరోనాలో డైనమిక్‌ ఈవెంట్‌లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. మ్యాగ్‌ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది. సుమారు 1,475 కేజీలు బరువున్న ఆదిత్య–ఎల్‌1లో ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్‌ బరువు 244 కేజీలు. మిగతా 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో నింపుతారు. ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్‌ బిందువు–1లోకి చేరవేయడానికి 177 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్‌పెక్స్, సూట్, వెల్సి, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్‌ అనే ఏడు ఉపకరణాలు పేలోడ్స్‌ ఉంటాయి.

సౌర తుపాన్‌ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? అనే అంశంపై ఆదిత్య–ఎల్‌1లోని ఏడు పేలోడ్లలో 170 కేజీల బరువుండే విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ వెల్సి అనే పేలోడ్‌తో సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది? సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై ఇది పరిశోధనలు చేస్తుంది. సౌర అతినీలలోహిత ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ అనే పేలోడ్‌ 35 కేజీల బరువు ఉంటంది. 200–400 ఎన్‌ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్‌ చిత్రాలను అందిస్తుంది. ఆదిత్య సోలార్‌ విండ్‌ పారిటకల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అనే పేలోడ్‌ సౌర గాలి వైవిధ్యం, లక్షణాలపై సమాచారాన్ని గ్రహించడంతోపాటు దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది.

ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్‌ ప్యాకేజీ సౌరగాలి కూర్పు, దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తుంది. సోలార్‌ ఎనర్జీ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటరు సోలార్‌ కరోనా సమస్యాత్మకమైన కరోనల్‌ హీటింగ్‌ మెకానిజంను అధ్యయనం చేయడానికి, ఎక్స్‌–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది.హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ సౌర కరోనాలో డైనమిక్‌ ఈవెంట్‌లను గమనించడానికి, విస్ఫోటనం సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది. మ్యాగ్‌ అనే ఈ పేలోడ్‌ను ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్